జనగామ బీఆర్‌ఎస్‌లో వర్గపోరు ముదిరింది. బీఆర్‌ఎస్ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. వేర్వేరుగా వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసుకున్నారు. జెడ్పీ కార్యాలయం సాక్షిగా వర్గపోరు బహిర్గతమైంది. పోచంపల్లికి సంబంధించిన గ్రూప్‌లో తన నెంబర్ ఎందుకు యాడ్ చేశారంటూ.. జెడ్పీ ఆఫీస్‌లో తరిగొప్పుల ఎంపీపీ హరిత భర్త సుదర్శన్ గొడవకు దిగారు. హైటెన్షన్ నెలకొనడంతో జెడ్పీ కార్యాలయానికి పోలీసులు వచ్చారు. ముత్తిరెడ్డిని ఓడించేందుకు సొంత పార్టీ నేతలే.. కుట్ర చేస్తున్నారంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.