సినిమా డైలాగ్‌లతో వెదురుకుప్పం SI వీరంగం

Update: 2023-06-06 05:12 GMT

చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో దారుణం జరిగింది. ఓ దళిత యువకుడిని చితకబాదాడు ఎస్సై లోకేష్‌. తనకు తిక్కఉంది.... ప్రస్తుతం 12 లాఠీలు విరిగాయి... మరో రెండు విరుగుతాయంటూ సినిమా డైలాగ్‌లతో వీరంగం సృష్టించాడు ఎస్సై లోకేష్‌. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ దళిత యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

వెదురుకుప్పంలో ఏటా మహాభారత ఉత్సవాల్లో జరుగుతాయి. ఇందులో భాగంగా గత ఆదివారం రాత్రి వీధి నాటకం జరిగింది. కొందరు యువకులు... తమకు కావాల్సిన సన్నివేశాన్ని అడగడంతో వివాదం చెలరేగింది. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయకమిటీ సభ్యులు. దీంతో హరిజనవాడకి చెందిన రామ్మూర్తి అనే యువకుడిని తీసుకెళ్లిన పోలీసులు....... చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అన్ని చికిత్స కోసం తిరుపతికి తరలించారు.

ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు దళిత సంఘాల నేతలు. ఎస్సైతో పాటు ఆలయ కమిటీ సభ్యుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. SI వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. SI లోకేష్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే.. ఎస్పీ ఆఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు దళిత సంఘాల నేతలు.

Similar News