TDP: అంబరాన్నంటిన సంబరాలు

Update: 2024-06-04 06:51 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం కొనసాగుతుండంతో అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర సంబరాలు.. అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. జై చంద్రబాబు, జై లోకేశ్‌ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో టీడీపీ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున యువత, మహిళలు చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. పరస్పరం మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఇప్పటివరకు రెండు విజయాలను నమోదు చేసింది. తొలి విజయాన్ని రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి నమోదు చేశారు. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై భారీ తేడాతో గెలుపొందారు. 63,056 ఓట్ల వేల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. రాజమహేంద్రరవంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి... వైసీపీ అభ్యర్థి మాగంటి భరత్‌పై వాసు విజయం సాధించారు.

Similar News