ఆనంద్ గ్రూప్ వ్యవస్థాపకుడు దీప్ సి ఆనంద్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. అక్టోబరు 27న హౌజ్ ఖాస్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో అంతిమ ప్రార్థనలు నిర్వహించనున్నారు. ముంబైలోని మహీంద్రా అండ్ మహీంద్రాలో ప్లాంట్ మేనేజర్‌గా 1954లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆనంద్ 27 ఏళ్ళ వయసులో తన మొదటి వ్యాపార వెంచర్, గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ గాబ్రియేల్ ఇండియాను ప్రారంభించారు. షాక్ అబ్జార్బర్‌లను తయారు చేసే ఈ కంపెనీని అమెరికాకు చెందిన మేర్‌మాంట్ కార్పొరేషన్‌తో కలిసి ఆయన స్థాపించారు. ఆనంద్ గ్రూప్ భారతదేశంలోని అనేక సంస్థలకు విస్తృత శ్రేణి ఆటోమోటివ్ భాగాలను సరఫరా చేస్తుంది. అలాగే తమ ఉత్పత్తులలో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. 2017లో ఆనంద్ గ్రూప్ టర్నోవర్ రూ. 9,000 కోట్లు.