Anand Mahindra: ఆనంద్ మహీంద్రా చెప్పిన బిజినెస్ పాఠం.. ఫాలో అయితే విజయం..
Anand Mahindra: దేశంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యాపారవేత్తలలో ఆనంద్ మహీంద్ర ఒకరు.;
Anand Mahindra (tv5news.in)
Anand Mahindra: దేశంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యాపారవేత్తలలో ఆనంద్ మహీంద్ర ఒకరు. ఎంతోమంది యువతకు ఆయన ఇన్‌స్పిరేషన్. ఆయన చెప్పే బిజినెస్ పాఠాలను వింటూ ఆయనలాగా అవ్వాలి అనుకునేవారు ఎందరో. అయితే ఆనంద్ మహీంద్ర బిజినెస్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలావరకు యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో ఒకటి ఓ కొత్త బిజినెస్ పాఠాన్ని నేర్పిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్ర.. వైవిధ్యభరితమైన వీడియోలు షేర్ చేయడంతో పాటు చాలామందిని ఇన్‌స్పైర్ చేసే బిజినెస్ పాఠాలు కూడా నేర్పిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఆయనలో ఒక సరదా మనిషి కూడా ఉన్నట్టు నిరూపించుకుంటూ ఉంటారు. తాజాగా ఆనంద్ మహీంద్ర ఓ వీడియోను ట్వీట్ చేస్తూ టీమ్ వర్క్ అంటే ఎలా ఉండాలో చెప్పారు.
ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ వీడియోలో రెండు కాకులు, ఓ పిల్లి తినుబండారం కోసం కొట్టుకుంటాయి. చివరికి అది పిల్లికే దక్కి తిందామని కూర్చుంటుంది. అంతలోనే ఓ కాకి.. దాని దృష్టిని మళ్లిస్తే మరో కాకి పిల్లి చేతిలో నుండి తినుబండారాన్ని లాగేసుకొని ఎగిరిపోతుంది. అలా టీమ్‌తో కలిసి పనిచేస్తే ప్రతిఫలం ఇంకా బాగుంటుందని ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్ర తెలిపారు.
Remember…you're always going to be more effective if you work collaboratively with a team.. 😊 #MondayMorning pic.twitter.com/lsKKKuJbcc
— anand mahindra (@anandmahindra) March 28, 2022