RBI: మధ్యతరగతి ప్రజలపై మరో భారం.. రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ

RBI: మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడింది. భారత రిజర్వు బ్యాంక్‌ ఇవాళ రుణాలపై వడ్డీ రేట్లను మరింత పెంచింది.

Update: 2023-02-08 07:41 GMT

RBI: మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడింది. భారత రిజర్వు బ్యాంక్‌ ఇవాళ రుణాలపై వడ్డీ రేట్లను మరింత పెంచింది. రెపో రేటును పావు శాతం పెంచడంతో రుణ భారం మరింత పెరగనుంది. తాజా పెంపుతో రెపో రేటు ఆరున్నర శాతానికి చేరింది.

మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ప్రకటించారు. రెపో రేటు పెరగడంతో రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయి. దీంతో ఈఎంఐల భారం కూడా మరింత పెరగనుంది.

ఇతర రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచే అవకాశముంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. అయితే ద్రవ్యోల్బణం మాత్రం నాలుగు శాతంపైనే ఉంటుందని తెలిపింది.

Tags:    

Similar News