WAR: భారత్‌పై 'హర్ముజ్' సెగ

హర్ముజ్ జలసంధి మూత.. ప్రపంచ చమురు మార్కెట్లలో కలకలం... ఒక్కరోజే 10% జంప్ చేసిన బ్రెంట్ క్రూడ్.. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో చమురు ధరల ర్యాలీ

Update: 2026-03-03 06:15 GMT

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు యుద్ధ ప్రాతిపదికన పెరుగుతుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్‌ జలసంధి లో నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడంతో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటాయి. సోమవారం మార్కెట్ ప్రారంభం కావడమే భారీ పెరుగుదలతో మొదలైంది.

ఒక్కరోజే 10 శాతం జంప్!

అం­త­ర్జా­తీయ మా­ర్కె­ట్లో బ్రెం­ట్ క్రూ­డ్ ఏప్రి­ల్ కాం­ట్రా­క్ట్ ధర బ్యా­రె­ల్‌­కు 10 శాతం పె­రి­గి 81.87 డా­ల­ర్ల­కు చే­రిం­ది. ఫ్యూ­చ­ర్స్‌­లో ఇది ఏకం­గా 13 శాతం పె­రు­గు­ద­ల­తో 82.37 డా­ల­ర్ల గరి­ష్ఠ స్థా­యి­ని తా­కిం­ది. 2025 జన­వ­రి తర్వాత ము­డి­చ­ము­రు ధరలు ఈ స్థా­యి­లో పె­ర­గ­డం ఇదే తొ­లి­సా­రి. ఆది­వా­రం ఇజ్రా­యె­ల్ జరి­పిన దా­డు­ల­కు ప్ర­తి­చ­ర్య­గా ఇరా­న్ భా­రీ­గా క్షి­ప­ణి దా­డు­ల­కు ది­గ­డం, గల్ఫ్ తీ­రం­లో మూడు చము­రు ట్యాం­క­ర్ల­ను ధ్వం­సం చే­శా­మ­ని ప్ర­క­టిం­చ­డం­తో సర­ఫ­రా వ్య­వ­స్థ పూ­ర్తి­గా స్తం­భిం­చి­పో­తుం­ద­నే భయాం­దో­ళ­న­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి.

హర్ముజ్ జలసంధి ఎందుకంత కీలకం?

ఒమన్ మరి­యు ఇరా­న్ మధ్య ఉండే ఈ ఇరు­కైన సము­ద్ర మా­ర్గం ప్ర­పంచ ఇంధన భద్ర­త­కు గుం­డె­కాయ వం­టి­ది. ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా వి­ని­యో­గిం­చే చము­రు­లో 20 శాతం (సు­మా­రు రో­జు­కు 21 మి­లి­య­న్ బ్యా­రె­ళ్లు) ఈ మా­ర్గం ద్వా­రా­నే రవా­ణా అవు­తుం­ది. ద్ర­వ­రూప సహజ వా­యు­వు (LNG)లో కూడా 20 శాతం వాటా ఇక్క­డి నుం­చే వస్తుం­ది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్ మరియు ఇరాన్ దేశాల చమురు ఎగుమతులకు ఇది ఏకైక మార్గం. ఈ జలసంధి మూతపడితే ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

భారత్‌కు 'బిలియన్ డాలర్ల' భారం

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్‌కు ఈ పరిణామాలు గొడ్డలిపెట్టు వంటివి. భా­ర­త్ రో­జు­కు 5.5 మి­లి­య­న్ బ్యా­రె­ళ్ల చము­రు­ను వి­ని­యో­గి­స్తుం­డ­గా, అం­దు­లో 1.5 నుం­డి 2 మి­లి­య­న్ బ్యా­రె­ళ్లు కే­వ­లం హర్ము­జ్ జల­సం­ధి నుం­చే వస్తా­యి. వి­శ్లే­ష­కుల అం­చ­నా ప్ర­కా­రం, బ్రెం­ట్ క్రూ­డ్ ధర ఒక డా­ల­ర్ పె­రి­గి­నా, భారత ప్ర­భు­త్వం ఏడా­ది­కి అద­నం­గా రూ.13,000 కో­ట్లు వె­చ్చిం­చా­ల్సి ఉం­టుం­ది. ఉక్రె­యి­న్ యు­ద్ధం నే­ప­థ్యం­లో రష్యా నుం­చి చము­రు ది­గు­మ­తు­లు తగ్గిం­చు­కు­న్న భా­ర­త్, ప్ర­స్తు­తం పశ్చి­మా­సి­యా­పై­నే ఎక్కు­వ­గా ఆధా­ర­ప­డు­తోం­ది. గతే­డా­ది భా­ర­త్ చము­రు ది­గు­మ­తుల కోసం 160 బి­లి­య­న్ డా­ల­ర్లు ఖర్చు చే­సిం­ది. తాజా ధరల పె­రు­గు­దల దేశ కరెం­ట్ అకౌం­ట్ డె­ఫి­సి­ట్ (CAD)పై తీ­వ్ర ప్ర­భా­వం చూ­ప­నుం­ది. భౌ­గో­ళిక రా­జ­కీయ అని­శ్చి­తి ఏర్ప­డి­న­ప్పు­డు వా­డు­కో­వ­డా­ని­కి భా­ర­త్ తన వ్యూ­హా­త్మక పె­ట్రో­లి­యం ని­ల్వ­ల­ను సి­ద్ధం చే­సు­కుం­ది. కేం­ద్ర మం­త్రి హర్ది­ప్ సిం­గ్ పురి వె­ల్ల­డిం­చిన వి­వ­రాల ప్ర­కా­రం, దే­శం­లో­ని భూ­గ­ర్భ ని­ల్వ­లు మరి­యు రి­ఫై­న­రీల వద్ద ఉన్న స్టా­క్ కలి­పి­తే భా­ర­త్‌­కు 74 రో­జుల పాటు చము­రు అవ­స­రా­ల­కు ఎటు­వం­టి ఇబ్బం­ది ఉం­డ­దు. ఇరా­న్-ఇజ్రా­యె­ల్ మధ్య ఘర్షణ కే­వ­లం క్షి­ప­ణి దా­డు­ల­కే పరి­మి­తం కా­కుం­డా, ఆర్థిక యు­ద్ధం­గా మా­రు­తోం­ది. హర్ము­జ్ జల­సం­ధి­ని ఇరా­న్ అడ్డు­కో­వ­డం అనే­ది ప్ర­పంచ దే­శా­ల­పై ఒత్తి­డి పెం­చే వ్యూ­హం­లో భా­గ­మే.

Tags:    

Similar News