IPOకు వస్తున్న బర్గర్ కింగ్

Update: 2020-10-24 03:19 GMT

బర్గర్ కింగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఈక్విటీ మార్కెట్లో నిధుల సమీకరణకు వస్తుంది. IPO ద్వారా 542 కోట్లు సమీకించడానికి అనుమతి కోరుతూ సెబీకి ధరఖాస్తు చేసింది. ప్రమోటర్ అయినా QSR ఏసియా Pte ltd 6 కోట్లు షేర్లు ఈక్విటీ షేర్లు విక్రయించనుంది.

బర్గర్ కింగ్ చెయిన్ రెస్టారెంట్లకు ప్రస్తుతం ఫ్రాంచైజీతో కలిపి దేశవ్యాప్తంగా పలునగరాల్లో 261 రెస్టారెంట్లు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, చండీఘర్, లుథియానా సహా మొత్తం 57 నగరాల్లో రెస్టారెంట్లు నిర్వహిస్తుంది. కంపెనీ అత్యంత వేగంగా వృద్ధినమోదు చేస్తున్న చెయిన్ రెస్టారెంట్లలో ఒకటిగా ఉంది. 2026 నాటికి కంపెనీ రెస్టారెంట్లను 700 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోవిడ్ కారణంగా విస్తరణ కార్యకలాపాలకు స్వల్పంగా ఆటంకం కలిగింది.  

Tags:    

Similar News