drone: దేశీయ డ్రోన్ తయారీకి కేంద్రం రూ.2000 కోట్లు

రక్షణ, పౌర రంగాల కోసం దేశీయ డ్రోన్లపై దృష్టి.. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ప్రణాళిక;

Update: 2025-07-07 07:00 GMT

దేశ రక్షణ, పౌర అవ­స­రా­ల­ను తీ­ర్చే డ్రో­న్‌ రం­గా­ని­కి కేం­ద్ర ప్ర­భు­త్వం భా­రీ­గా ప్రో­త్సా­హం ఇచ్చేం­దు­కు సన్నా­హా­లు చే­స్తోం­ది. ఇం­దు­కో­సం దా­దా­పు 234 మి­లి­య­న్‌ డా­ల­ర్లు (రూ.2000 కో­ట్లు) వి­లు­వైన కొ­త్త ప్రో­త్సా­హక పథ­కా­న్ని ఆవి­ష్క­రిం­చ­ను­న్న­ట్టు వా­ర్తా సం­స్థ రా­యి­ట­ర్స్‌ వి­శ్వ­స­నీయ వర్గాల నుం­చి సమా­చా­రం.

ఈ పథకం మూ­డే­ళ్ల పాటు అమ­లు­లో ఉం­టుం­ది. డ్రో­న్లు, వి­డి­భా­గా­లు, సా­ఫ్ట్‌­వే­ర్, కౌం­ట­ర్‌ డ్రో­న్‌ వ్య­వ­స్థ­లు, సే­వ­లు తది­తర అం­శా­లు ఇం­దు­లో చేరే అవ­కా­శం ఉంది. 2021లో ప్రా­రం­భ­మైన పీ­ఎ­ల్‌ఐ పథకం కింద అం­దిం­చిన రూ.120 కో­ట్ల­తో పో­లి­స్తే, ఇది అనేక రె­ట్లు అధి­క­మైం­ది. పహ­ల్గాం­లో జరి­గిన మా­ర­ణ­హో­మం, ఆ తర్వాత భారత–పా­కి­స్థా­న్‌ మధ్య ఉద్రి­క్త­తల నే­ప­థ్యం­లో డ్రో­న్ల ప్రా­ధా­న్యం ఎంత వరకు ఉందో స్ప­ష్ట­మైం­ది. ఇప్ప­టి­వ­ర­కు ఇజ్రా­యె­ల్‌ నుం­చి డ్రో­న్ల­ను ది­గు­మ­తి చే­సు­కుం­టూ వచ్చిన భా­ర­త్, ప్ర­స్తు­తం కొ­న్ని డ్రో­న్ల­ను సొం­తం­గా తయా­రు చే­స్తోం­ది. అయి­తే, మో­టా­ర్లు, సె­న్స­ర్లు, ఇమే­జిం­గ్‌ సి­స్ట­మ్స్‌ కోసం ఇప్ప­టి­కీ చై­నా­పై ఆధా­ర­ప­డు­తోం­ది. తా­జా­గా రూ­పొం­దిం­చిన పథకం కింద 2027–28 నా­టి­కి కనీ­సం 40% కీలక వి­డి­భా­గా­ల­ను దే­శీ­యం­గా ఉత్ప­త్తి చే­యా­ల­న్న­ది లక్ష్యం. ప్ర­స్తు­తం దే­శ­వ్యా­ప్తం­గా 600కు పైగా డ్రో­న్‌ తయా­రీ సం­స్థ­లు ఉన్నా­యి. వీ­టి­లో దే­శీ­యం­గా వి­డి­భా­గా­ల­ను ఉత్ప­త్తి చేసే సం­స్థ­ల­కు అద­న­పు ప్రో­త్సా­హ­కా­లు, తక్కువ వడ్డీ రు­ణా­లు అం­దిం­చే అం­శం­పై కేం­ద్రం యో­చి­స్తోం­ది. స్మా­ల్‌ ఇం­డ­స్ట్రీ­స్‌ డె­వ­ల­ప్‌­మెం­ట్‌ బ్యాం­క్‌ (SIDBI) సం­స్థ­లు మూ­ల­ధన అవ­స­రాల కోసం ప్ర­త్యేక రుణ పథ­కా­లు అం­దిం­చ­నుం­ది. ఈ ప్ర­తి­పా­దిత పథకం అమ­ల­య్యే సం­ద­ర్భం­లో భా­ర­త్‌ డ్రో­న్‌ రం­గం­లో స్వ­యం­గా ఎది­గే ది­శ­గా ముం­ద­డు­గు పడు­తుం­ది. ఆప­రే­ష­న్ సిం­దూ­ర్ తరు­వాత దే­శీయ డ్రో­న్ కం­పె­నీల స్టా­క్స్ ఒక్క­సా­రి­గా పె­రి­గా­యి. ఈ క్ర­మం­లో డ్రో­న్ల­కు భవి­ష్య­త్తు­లో మంచి ఆదరణ ఉం­టుం­ద­ని, యు­ద్ధాల కో­స­మే పె­ద్ద ఎత్తున డ్రో­న్ల­కు ఆర్డ­ర్లు వస్తా­య­ని ఆశి­స్తు­న్నా­యి ఆయా కం­పె­నీ­లు. ఈ క్ర­మం­లో దే­శీ­యం ఉత్ప­త్తు­ల­కు ఆర్డ­ర్లు పె­రు­గు­తా­య­న్న అం­చ­నా­లు ఉన్నా­యి.

డిమాండ్లకు అనుగుణంగా....

భా­ర­త­దేశ డ్రో­న్ పరి­శ్రమ స్వ­దే­శీ ఉత్ప­త్తి­ని అభి­వృ­ద్ధి చే­య­డా­ని­కి, ది­గు­మ­తు­ల­ను తగ్గిం­చ­డా­ని­కి, డ్రో­న్ టె­క్నా­ల­జీ­లో దేశ నా­య­క­త్వ స్థా­నా­న్ని పెం­చ­డా­ని­కి ఎక్కువ ఆర్థిక సహా­యం, వి­ధాన మద్ద­తు చర్య­ల­ను పా­రి­శ్రా­మిక రంగం డి­మాం­డ్ చే­స్తోం­ది. ఈ రంగం వృ­ద్ధి రే­టు­ను పెం­చ­డా­ని­కి ఉత్ప­త్తి-సం­బం­ధిత ప్రో­త్సా­హక (PLI) పథ­కా­న్ని వి­స్త­రిం­చా­ల­ని, పన్ను ప్ర­యో­జ­నా­లు కల్పిం­చా­ల­ని మరి­యు మూ­ల­ధ­నా­న్ని అం­దు­బా­టు­లో ఉం­చ­డా­ని­కి మరి­న్ని ప్ర­య­త్నా­లు చే­యా­ల­ని పరి­శ్రమ నా­య­కు­లు పి­లు­పు­ని­చ్చా­రు. డ్రో­న్ల కోసం మొ­ద­టి PLI పథకం సె­ప్టెం­బ­ర్ 2021న మూడు సం­వ­త్స­రా­ల­లో రూ. 120 కో­ట్ల­తో ప్రా­రం­భిం­చ­బ­డిం­ది. ఇది డ్రో­న్ ఉత్ప­త్తి, భా­గాల తయా­రీ మరి­యు సా­ఫ్ట్‌­వే­ర్ అభి­వృ­ద్ధి­ని ప్రో­త్స­హిం­చ­డం లక్ష్యం­గా పె­ట్టు­కుం­ది. అయి­తే, ఈ పరి­శ్ర­మ­ను పూ­ర్తి­గా ఇం­ధ­నం­గా మా­ర్చ­డా­ని­కి చాలా ఎక్కువ కే­టా­యిం­పు­లు అవ­స­ర­మ­ని ని­వే­ది­స్తు­న్నా­రు.

Tags:    

Similar News