Elon Musk : ఎలన్ మస్క్ నెక్ట్స్ టార్గెట్ కోకా కోలా
Elon Musk : ఎలన్ మస్క్ నెక్ట్స్ టార్గెట్ కోకా కోలానే. కోకా కోలా సంస్థను కొనడమే తన తదుపరి వ్యూహం అంటూ ట్విటర్ వేదికగా ఎలాన్ మస్క్ ప్రకటించారు.;
Elon Musk : ఎలన్ మస్క్ నెక్ట్స్ టార్గెట్ కోకా కోలానే. కోకా కోలా సంస్థను కొనడమే తన తదుపరి వ్యూహం అంటూ ట్విటర్ వేదికగా ఎలాన్ మస్క్ ప్రకటించారు. అంతేకాదు కోకా కోలాలో కొకైన్ తిరిగి తెస్తానంటూ ప్రకటించి సంచలనం రేపారు. ట్విట్టర్ చూసి మురిసిపోయి, ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ తీసుకొద్దామనుకున్న ఎలాన్ మస్క్.. ఏకంగా ట్విటర్‌నే తన ఖాతాలో వేసుకున్నారు. ఇందుకోసం 3 లక్షల 34వేల కోట్లు ఖర్చుపెడుతున్నాడు. ఇప్పుడు కోకా కోలాను కూడా భారీ డీల్‌కే కొనుగోలు చేసేలా కనిపిస్తున్నారు.
కోకా కోలాను కొనే ప్రతిపాదన వరకు ఓకే. కాని, అందులో కొకైన్‌ను తిరిగి తెస్తానంటూ ప్రకటన చేయడమే సంచలనం రేపుతోంది. మొదట్లో కోకా ఆకులు, కోలా గింజలు కలిపి కోకా కోలా తయారుచేశారు. నిజానికి కోలా గింజల్లో కెఫిన్ ఉంటుంది. కోకా ఆకుల్లో సైకోయాక్టివ్ డ్రగ్ కొకైన్ లభిస్తుంది. దీంతో ఈ డ్రింక్‌పై ఎన్నో అభ్యంతరాలు తలెత్తాయి. అప్పటి నుంచి అమెరికాలో కోకా-కోలా ఫార్ములా నుంచి కొకైన్‌ను తొలగించారు. కోకా కోలా కొన్న తరువాత అందులో తిరిగి కొకైన్ తెస్తానంటూ మస్క్ ట్వీట్ చేశారు.