Tata Punch Sales : 5 లక్షల ధర.. 5 స్టార్ సేఫ్టీ.. ఏకంగా 7 లక్షల మంది కొనేశారు.

Update: 2026-02-11 08:15 GMT

Tata Punch Sales : టాటా మోటార్స్ సృష్టించిన చిన్నపాటి సునామీ టాటా పంచ్. మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. నెమ్మదిగా మొదలై, ఇప్పుడు టాటా కార్ల సామ్రాజ్యంలో అగ్రగామిగా ఎదుగుతుంది టాటా పంచ్. టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా పంచ్ నిలిచింది. అక్టోబర్ 2021లో మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి, కేవలం ఐదేళ్లలోపే ఈ కారు 7 లక్షల యూనిట్ల విక్రయాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. జనవరి 2026 చివరి నాటికి సుమారు 6.97 లక్షల కార్లు అమ్ముడవగా, ఫిబ్రవరి మొదటి వారంలోనే ఆ మ్యాజిక్ నంబర్ 7,00,000ను దాటేసింది. ఇది ఒక సాధారణ కారు సాధించిన ఘనత కాదు, భారతీయుల మనసు గెలుచుకున్న ఒక ఎమోషన్.

గత నెల, అంటే జనవరి 2026 టాటా పంచ్ చరిత్రలో ఒక గోల్డెన్ మంత్ అని చెప్పాలి. ఒక్క నెలలోనే ఏకంగా 19,257 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఏడాది ప్రాతిపదికన 19% వృద్ధిని నమోదు చేసింది. ఈ సక్సెస్‌తో టాటా మోటార్స్ తన మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 70,222 యూనిట్ల అత్యున్నత స్థాయికి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం జనవరి 13న లాంచ్ అయిన సరికొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్. ఇందులో ప్రవేశపెట్టిన టర్బో-పెట్రోల్ ఇంజిన్, అదిరిపోయే ఫీచర్లు కస్టమర్లను క్యూ కట్టేలా చేస్తున్నాయి.

ప్రస్తుతం టాటా పంచ్ పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఇలా మూడు రూపాల్లో, మొత్తం 33 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇటీవల జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత, టాటా సంస్థ ఈ కారు ధరలను భారీగా తగ్గించింది. కొన్ని వేరియంట్లపై సుమారు రూ.85,000 వరకు ధర తగ్గడం సామాన్యుడికి పెద్ద ఊరటనిచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచే మొదలవుతోంది. ఐదేళ్ల క్రితం ఏ ధరకు లాంచ్ అయిందో, అన్నీ పెరిగినా మళ్లీ అదే ధరకే దొరుకుతుండటం ఈ కారుకు ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్.

పంచ్ కారుకు ఉన్న అసలైన బలం దాని సేఫ్టీ. మార్కెట్లోకి రాకముందే గ్లోబల్ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన ఏకైక మైక్రో SUV ఇది. ఎత్తైన సీటింగ్ పొజిషన్, రోడ్డుపై గ్రిప్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు దీనిని ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ కారుగా మార్చేశాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కొనేవారు కూడా ఇప్పుడు దాని బదులు సెక్యూరిటీ ఎక్కువగా ఉండే పంచ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

Tags:    

Similar News