Fiber Cylinder: అందుబాటులోకి ఫైబర్ సిలిండర్లు... ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Fiber Cylinder: అందుబాటులోకి ఫైబర్ సిలిండర్లు వచ్చేశాయ్.. ఇండేన్ సంస్థ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి విక్రయిస్తోంది.;
Fiber Cylinder: అందుబాటులోకి ఫైబర్ సిలిండర్లు వచ్చేశాయ్.. ఇండేన్ సంస్థ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి విక్రయిస్తోంది. ప్రస్తుతానికి అయితే ఇందులో పది కిలోలు, అయిదు కిలోలు మాత్రమే విక్రయిస్తున్నారు. 10 కిలోల ఫైబర్ సిలిండర్‌కు రూ.3,350 ఉండగా.. 5 కిలోల సిలిండర్‌కు రూ.2,150 అడ్వాన్స్ చెల్లించాలి. పాత ఇనుప సిలిండర్లు ఇచ్చి డబ్బు చెల్లించి ఈ సిలిండర్ తీసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న గంటల వ్యవధిలోనే ఇళ్లకు సరఫరా చేస్తామని ఇండేన్ సంస్థ తెలిపింది.
ఇక ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఫైబర్ సిలిండర్ బరువు చాలా తక్కువ.. సులభంగా ఎత్తుకోవచ్చు. ఖాళీ ఇనుప సిలిండర్ బరువు 16 కిలోలు ఉండగా.. ఫైబర్ సిలిండర్ కేవలం 6.3 కిలోలే ఉంటుంది. మామూలు సిలిండర్‌లో గ్యాస్ కనిపించదు. కానీ ఫైబర్ సిలిండర్‌లో క్లియర్ గా గ్యాస్ కనిపిస్తుంది. ఇనుప సిలిండర్ అయితే పేలే ప్రమాదం ఉంది.. కానీ ఫైబర్ సిలిండర్ పేలదు.. ఇనుప సిలిండర్ తుప్పు పడుతుంది.. మరకలు పడతాయి.. కానీ ఫైబర్ సిలిండర్ లో అలాంటి సమస్యలుండవు.