Gold Rate: పండగ వేళ పసిడి ధరలు స్థిరంగా.. వెండి కూడా అదే దారిలో..

Gold Rate: పండగలు.. పెళ్లిళ్లు.. పసిడి ధరలు తగ్గితే పది గ్రాములైనా కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతుంటారు పసిడి ప్రియులు.

Update: 2021-10-14 06:07 GMT

Gold Rate: పండగలు.. పెళ్లిళ్లు.. పసిడి ధరలు తగ్గితే పది గ్రాములైనా కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతుంటారు పసిడి ప్రియులు. ఒకరోజు పెరిగి మరొక రోజు తగ్గుతున్న బంగారం ధరలు పసిడి కొనుగోలు దారులను నిరాశపరుస్తుంటాయి.

అయితే దసర పండుగ వేళా విశేషం పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా మార్పు లేదు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది.

న్యూ ఢిల్లీలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.46,310, ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,300, చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,450, కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,710 ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే అది కూడా స్థిరంగానే ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,800 ఉండగా, విజయవాడలో రూ.65,800 వద్ద కొనసాగుతోంది.

న్యూ ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,500 ఉండగా, ముంబైలో రూ.62,500లు, చెన్నైలో రూ.66,300, కోల్‌కతాలో రూ.62,500 పలుకుతోంది.

బంగారం ధరలు నిత్యం మారుతుంటాయి. ధరల్లో హెచ్చు తగ్గులు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం ప్రధాన కారణాలు.

గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, మార్కెట్లో బంగారానికి ఉన్న డిమాండ్ వంటి పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తాయి.

Tags:    

Similar News