Volkswagen : జర్మన్ టెక్నాలజీతో సబ్-4 మీటర్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ.. ఫాక్స్ వ్యాగన్ నయా ప్లాన్ అదుర్స్.

Update: 2026-03-09 06:53 GMT

Volkswagen : భారతదేశంలో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ఎంత హాట్‌గా ఉందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లతో ఈ మార్కెట్ కిక్కిరిసిపోయింది. అయితే, ఇప్పుడు జర్మన్ దిగ్గజం ఫాక్స్ వ్యాగన్ కూడా ఈ రేసులోకి దూకడానికి రంగం సిద్ధం చేసుకుంది. 2027 మధ్య నాటికి సరికొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. స్కోడా కైలాక్ సృష్టించిన సెన్సేషన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఫాక్స్ వ్యాగన్ తనదైన స్టైల్ అండ్ పవర్ తో మార్కెట్లోకి రాబోతోంది.

స్కోడా కైలాక్ నిర్మించిన అదే ప్లాట్‌ఫారమ్ మీద ఈ కొత్త ఫాక్స్ వ్యాగన్ కారు కూడా రూపుదిద్దుకోనుంది. అయితే, లుక్ పరంగా మాత్రం ఇది స్కోడా కారు కంటే చాలా భిన్నంగా ఉండబోతోంది. ఫాక్స్ వ్యాగన్ తన సిగ్నేచర్ గ్రిల్, కొత్త డిజైన్ బంపర్లు, సరికొత్త ఎల్‌ఈడీ లైట్లతో దీనిని అదిరిపోయేలా తీర్చిదిద్దుతోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడానికి ఇందులో GT లైన్ ట్రిమ్స్ కూడా ఉండొచ్చని సమాచారం. ఈ మోడల్‌లో బ్లాక్ యాక్సెంట్స్ తో కారు చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఇంటీరియర్ పరంగా కూడా కైలాక్ కంటే ఎక్కువ ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ కొత్త ఎస్‌యూవీలో 1.0 లీటర్, మూడు సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను వాడనున్నారు. ఇది గరిష్టంగా 115 BHP పవర్‌ను, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గియర్ బాక్స్ విషయానికి వస్తే.. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. సేఫ్టీ విషయంలోనూ ఫాక్స్ వ్యాగన్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ముందు డిస్క్ బ్రేకులు, వెనుక డ్రమ్ బ్రేకులతో పాటు స్కోడా కుషాక్ నుంచి తీసుకున్న పవర్‌ఫుల్ సస్పెన్షన్ సిస్టమ్ ను ఇందులో అమరుస్తున్నారు. దీనివల్ల రోడ్డుపై ప్రయాణం చాలా స్మూత్ గా ఉంటుంది.

ధర విషయానికి వస్తే, ఫాక్స్ వ్యాగన్ ఈ కారును సామాన్యులకు కూడా అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తోంది. దీని ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర దాదాపు రూ.7.60 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ వేరియంట్ రూ.14 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. క్వాలిటీ, పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ కారు ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది. 2027 నాటికి ఈ కారు రోడ్లపైకి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నెక్సాన్, బ్రెజాలకు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం.

Tags:    

Similar News