బాబోయ్.. ఒక్కరోజే రూ.3వేలు పెరిగిన వెండి!
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శుక్రవారం అయితే వెండి ధరలు అమాంతం ఎగబాకాయి.;
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శుక్రవారం అయితే వెండి ధరలు అమాంతం ఎగబాకాయి. ఒక్కరోజే రూ. 2,915 పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో కేజీ వెండి రూ.68,410 పలికింది. అటు బంగారం ధరలు రూ. 132 పెరిగాయి. దీనితో 10 గ్రాముల బంగారం ధర రూ.48,376గా ఉంది. అంతర్జాతీయ విపణిలో ధరల పెరుగుదలతో పాటు, కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపరులు భావిస్తున్నారు. దీంతో దేశీయ విపణిలో ఈ లోహల ధరలు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు బంగారం 1,844.35 డాలర్లు, ఔన్సు వెండి 26.35 డాలర్లుగా ఉంది.