పసిడి ధరలు స్వల్పంగా..

ఇటీవలి కాలంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, లాక్‌డౌన్ ఉండకపోవచ్చని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలతో బంగారంపై ఒత్తిడి లేకుండా పోయింది.

Update: 2021-03-29 07:34 GMT

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి. ఫ్యూచర్ మార్కట్లో గత కొద్ది వారాలుగా రూ.45,000కు దిగువన కదలాడుతున్నాయి. ఇటీవలి కాలంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, లాక్‌డౌన్ ఉండకపోవచ్చని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలతో బంగారంపై ఒత్తిడి లేకుండా పోయింది. మరోవైపు కొనుగోలుదారులు బిట్‌కాయిన్ వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పసిడిపై ఒత్తిడి తగ్గి గోల్డ్ ధరలు పెరగడం లేదు.

ఫ్యూచర్ మార్కెట్‌లో మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45.00 క్షీణించి రూ.44650.00 వద్ద ట్రేడ్ అయింది. ఆల్‌టైమ్ గరిష్టంతో రూ.11,600 తక్కువ ఉంది. వెండి స్వల్పంగా తగ్గింది. రూ.185 తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.185.00 తగ్గి రూ.64684 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్షీణించాయి. ఔన్స్ బంగారం ధర 3.55 డాలర్లు తగ్గి 1,728 వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,726.70-1,733.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల దిగువకు వచ్చింది. ఔన్స్ ధర 0.164 డాలర్లు తగ్గి 24,950 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24,845-25.145 డాలర్ల మధ్య కదలాడింది. 

Tags:    

Similar News