పడిపోయిన పసిడి ధర..

22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలాగే పడిపోయింది. ఆగస్ట్ 7న బంగారం ధర 10 గ్రాములకు రూ.54,200 స్థాయికి ఎగసింది.

Update: 2020-12-03 11:26 GMT

బంగారం కొనాలనుకుంటున్నారా? ఎప్పుడు కొనాలో అర్థం కావడం లేదా? బంగారం ధర ఇప్పటికే భారీగా పడిపోయింది. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. 4 నెలల్లో భారీగా పతనమైంది. పసిడి కొనుగోలుదారులకు ఇది శుభవార్తే కానీ.. పెరుగుతుందని ఆశించిన ఇన్వెస్ట్ చేసినవారికి మాత్రం నిరాశే. ఆగస్ట్ 7న ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది బంగారం ధర. తర్వాతి నుంచి క్రమంగా పడిపోతూ వచ్చింది. ఆగస్ట్ 7న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.59,130 వద్ద ట్రేడ్ అయింది.

ఇప్పుడు బంగారం ధర రూ.49,260 స్థాయికి పతనమైంది. అంటే పసిడి ధర రూ.9,800 పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలాగే పడిపోయింది. ఆగస్ట్ 7న బంగారం ధర 10 గ్రాములకు రూ.54,200 స్థాయికి ఎగసింది. ఇప్పుడు ఇదే బంగారం ధర 10 గ్రాములకు రూ.45,150 వద్ద కదలాడుతోంది. అంటే బంగారం ధర ఆగస్ట్ నుంచి చూస్తే ఏకంగా రూ.9,000 వరకూ కుప్పకూలింది. అటు వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. ఆగస్ట్ 7న కేజీ వెండి ధర ఏకంగా రూ.76,510 స్థాయికి పరుగులు పెట్టింది.

కానీ ఇప్పుడు వెండి ధర కేజీకి రూ.67,700కు పతనమైంది. అంటే ఆగస్ట్ నెల నుంచి వెండి ధర ఏకంగా రూ.8,810 కిందకు పడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం లేదని కనిపిస్తుంది. మార్కెట్లు పెరుగుతున్నాయి. డాలర్ బలహీనంగా ఉంది. వ్యాక్సిన్ వార్తలతో ఈక్విటీల్లోకి వస్తున్నారు.

Tags:    

Similar News