Gold Rate Today: ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today:;
Gold Rate Today: బంగారం లాంటి వార్త.. గత నెల రోజుల కాలంలో ఈ విధంగా తగ్గడం ఇదే మొదటి సారి. పసిడి ప్రియులు బంగారం కొనుగోలుకు పరుగులు పెట్టే స్థాయిలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,300కు పైగా పతనమైంది. పసిడి రేటు రూ.48,290 నుంచి రూ.45,980కు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఇదే విధంగా తగ్గి రూ.44,250 నుంచి రూ.42,150కు క్షీణించింది.
బంగారం ధర ఇలా ఉంటే వెండి రేటు మాత్రం దాదాపు స్థిరంగానే కొనసాగుతోంది. గత నెల రోజుల కాలంలో వెండి రేటులో దాదాపు ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 12న వెండి రేటు కేజీకి రూ.73,300 వద్ద నిలకడగా ఉంది.. ఇప్పుడు కూడా దాదాపు అదే రేటు కొనసాగుతోంది.
కానీ బంగారం ధర మాత్రం గత ఏడాది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. అప్పుడు పసిడి రేటు ఏకంగా రూ.59 వేలకు పైగా చేరింది. అప్పటి రేటుతో పోల్చి చూస్తే ఇప్పుడు బంగారం ధర భారీగా పతనమైందని చెప్పుకోవచ్చు.
గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1722 డాలర్లు
24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.46,340
22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.42,500
దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.67,400
డాలర్‌తో పోలిస్తే 72.90 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ
బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 69.50 డాలర్లు