GOLDRATES: క్రమంగా దిగి వస్తున్న పసిడి ధరలు

మూడు రోజుల్లో రూ. 4,400 తగ్గిన బంగారం ధరలు;

Update: 2025-04-26 05:30 GMT

అక్షరాల లక్ష దాటిన బంగారం ధరలు.. క్రమంగా దిగి వస్తున్నాయి. చైనా దిగుమతులపై టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంత ఊరటనిచ్చే సంకేతాలు ఇవ్వడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ఈ ప్రభావంతో దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి. ఏప్రిల్ 22న 10 గ్రాముల బంగారం ధర రూ. 99,358 వద్ద రికార్డు స్థాయిని తాకిన తర్వాత... కేవలం మూడు రోజుల్లోనే ఎంసీఎక్స్ బంగారం ధర రూ. 4,400కు పైగా క్షీణించింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ కాంట్రాక్ట్ మరింత దిగజారింది. అంతర్జాతీయంగా టారిఫ్ యుద్ధంపై ఆందోళనలు సడలడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో గోల్డ్ కాంట్రాక్ట్ ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ. 94,991 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో ఇది రూ. 94,950 కనిష్ట స్థాయిని కూడా తాకింది.

    లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో గోల్డ్ కాంట్రాక్ట్ ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ. 94,991 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో ఇది రూ. 94,950 కనిష్ట స్థాయిని కూడా తాకింది. ట్రంప్ మాట్లాడుతూ చైనాతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తన వాణిజ్య భాగస్వాములతో చర్చలు జరుపుతున్నామని, అనుకూలమైన వాణిజ్య ఒప్పందాలు కుదురుతాయనే అంచనాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, డాలర్ బలపడటం కూడా బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చింది. డాలర్ సూచీ 0.3 శాతం పెరిగింది. డాలర్ బలపడటం విదేశీ కొనుగోలుదారులకు పసిడిని మరింత ఖరీదైనదిగా చేస్తుంది,

బంగారం ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరడానికి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, అమెరికా మాంద్యం భయాలు కారణమయ్యాయి. అయితే, రూ. 1 లక్ష స్థాయికి చేరిన తర్వాత లాభాల స్వీకరణ ఉంటుందని విశ్లేషకులు ముందే అంచనా వేశారు. స్వల్పకాలికంగా ధరల్లో కొంత దిద్దుబాటు ఉన్నప్పటికీ, ఈ ఏడాది మొత్తం మీద బంగారంపై సానుకూల దృక్పథమే కొనసాగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత తగ్గుదల కొనుగోలు అవకాశంగా చూడవచ్చని కొందరు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేటు హెచ్చుతగ్గులు భారత్‌లో బంగారం ధరలను ప్రధానంగా ప్రభావితం చేస్తాయి.

Tags:    

Similar News