Gold Rate Today: నిలకడగా ఉన్న బంగారం ధరలు..

బంగారం ధరలు ఈ మధ్య కొంచెంకొంచెం తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు మాత్రం పెద్దగా మార్పు లేకుండా 10 గ్రాములకు..

Update: 2021-09-25 05:53 GMT

Gold Rate Today: బంగారం ధరలు ఈ మధ్య కొంచెంకొంచెం తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు మాత్రం పెద్దగా మార్పు లేకుండా 10 గ్రాములకు రూ. 45,240 వద్ద బంగారం ధర నిలిచింది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 4,524గా ఉంది. ఇది జీఎస్టీ లేకుండా ఉన్న ధర. ఇక 100 గ్రాముల ధర రూ. 4,52,400 దగ్గర నిలిచింది. నిన్న 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 600 తగ్గిన విషయం తెలిసిందే. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఇండియాలో టర్నోవర్‌లో బంగారం ధర 1.28 శాతం తగ్గి రూ. 46,075 దగ్గర ఆగింది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 43,200 ఉంది. హైదరాబాద్‌తో పాటు కేరళ, బెంగుళూరు లాంటి ప్రాదేశాల్లో కూడా ఇదే ధర చలామణీ అవుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 43,350 ఉంది. ముంబాయిలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 45,240 ఉంది. చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 43,570 ఉంది. 

Tags:    

Similar News