HDFC : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం కానున్న హెచ్‌డీఎఫ్‌సీ
HDFC : దేశ కార్పొరేట్ చరిత్రలో మరో మెగా విలీనం జరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనానికి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.;
HDFC : దేశ కార్పొరేట్ చరిత్రలో మరో మెగా విలీనం జరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనానికి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రతి 25 హెచ్‌డీఎఫ్‌సీ షేర్లకు 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు వాటాదారులకు లభించనున్నాయి. విలీనం తర్వాత సంస్థలో హెచ్‌డీఎఫ్‌సీకి 41శాతం వాటా దక్కనుంంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పబ్లిక్ హోల్డర్స్ 100శాతం భాగం కానున్నారు. మరోవైపు ఇవాళ స్టాక్ మార్కెట్లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు దౌడు తీస్తున్నాయి. ఇవాళ్టి మార్కెట్లను ఈ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ఆరున్నర శాతం పైగా లాభంతో కొనసాగుతోన్నాయి.