INDIA: భారత ఆర్థిక వ్యవస్థకు తిప్పలు తప్పవా.?

ప్రపంచంలో ఇరాన్ యుద్ధ కలవరపాటు... కుదేలవుతున్న ప్రపంచ ఇంధన మార్కెట్లు..భారత చమురు భద్రతపైనా తీవ్ర ప్రభావం

Update: 2026-03-01 07:30 GMT

మధ్య­ప్రా­చ్యం­లో ఉద్రి­క్త­త­లు మళ్లీ ప్ర­మా­ద­కర దశ­లో­కి ప్ర­వే­శిం­చా­యి. ఇరా­న్‌­లో­ని కీలక లక్ష్యా­ల­పై అమె­రి­కా–ఇజ్రా­యె­ల్ సం­యు­క్త దా­డు­లు పశ్చి­మా­సి­యా­లో భద్ర­తా ఆం­దో­ళ­న­ల­ను మరింత తీ­వ్ర­త­రం చే­శా­యి. ఈ పరి­ణా­మా­లు కే­వ­లం ప్రాం­తీయ ఘర్ష­ణ­ల­కే పరి­మి­తం కావు. ప్ర­పంచ ఇంధన మా­ర్కె­ట్లు, అం­త­ర్జా­తీయ వా­ణి­జ్య మా­ర్గా­లు, ము­ఖ్యం­గా భారత ఆర్థిక వ్య­వ­స్థ­పై కూడా వీటి ప్ర­భా­వం స్ప­ష్టం­గా కని­పిం­చే అవ­కా­శం ఉం­ద­ని ని­పు­ణు­లు హె­చ్చ­రి­స్తు­న్నా­రు.

హార్ముజ్ జలసంధి చుట్టూనే..

ప్ర­స్తు­తం అం­ద­రి దృ­ష్టి ని­లి­చిం­ది హా­ర్ము­జ్ జల­సం­ధి­పై­నే. ఇరా­న్‌­ను ఒమన్, యూ­ఏ­ఈల నుం­చి వేరు చేసే ఈ జల­సం­ధి ప్ర­పంచ చము­రు రవా­ణా­కు అత్యంత కీలక మా­ర్గం. ప్ర­పంచ చము­రు వా­ణి­జ్యం­లో దా­దా­పు 20 శాతం ఈ మా­ర్గం ద్వా­రా­నే సా­గు­తోం­ది. ఈ ప్రాం­తం­లో యు­ద్ధ వా­తా­వ­ర­ణం నె­ల­కొ­న­డం ప్ర­పంచ ఇంధన భద్ర­త­కు పె­ద్ద ము­ప్పు­గా మా­రిం­ది. భా­ర­త్ పరి­స్థి­తి మరింత సు­న్ని­తం­గా ఉంది. దేశం వి­ని­యో­గిం­చే ముడి చము­రు­లో సు­మా­రు 85 శాతం వి­దే­శాల నుం­చే ది­గు­మ­తి అవు­తోం­ది. అం­దు­లో 50 శా­తా­ని­కి పైగా హా­ర్ము­జ్ జల­సం­ధి గుం­డా వస్తోం­ది. రో­జు­కు సు­మా­రు 26 లక్షల బ్యా­రె­ళ్ల ముడి చము­రు­ను భా­ర­త్ ఇరా­క్, సౌదీ అరే­బి­యా, యూఏఈ, కు­వై­ట్ వంటి దే­శాల నుం­చి ఈ మా­ర్గం­లో ది­గు­మ­తి చే­సు­కుం­టోం­ది. అదే­వి­ధం­గా రో­జు­కు సు­మా­రు 74,000 బ్యా­రె­ళ్ల శు­ద్ధి చే­సిన చము­రు ఉత్ప­త్తు­ల­ను కూడా ఇదే మా­ర్గం ద్వా­రా ఎగు­మ­తి చే­స్తోం­ది. ఇప్ప­టి­కే అమె­రి­కా బల­గాల మో­హ­రిం­పు­తో అం­త­ర్జా­తీయ మా­ర్కె­ట్లో ముడి చము­రు ధరలు దా­దా­పు 10 శాతం మేర పె­రి­గా­యి. ఇరా­న్ రో­జు­కు ఉత్ప­త్తి చేసే 33 లక్షల బ్యా­రె­ళ్ల చము­రు సర­ఫ­రా­లో అం­త­రా­యం కలి­గి­తే, బ్యా­రె­ల్ ధరలు 76–81 డా­ల­ర్ల వరకు చే­ర­వ­చ్చ­ని సూ­చి­స్తు­న్నా­యి.

రూపాయి పతనం, దిగుమతుల భారం

భా­ర­త్ చము­రు కొ­ను­గో­ళ్ల­కు అమె­రి­క­న్ డా­ల­ర్ల­లో చె­ల్లిం­పు­లు చే­స్తుం­ది. ధరలు పె­రి­గి­తే మరింత ఎక్కువ డా­ల­ర్లు ఖర్చు చే­యా­ల్సి ఉం­టుం­ది. దీని వల్ల డా­ల­ర్‌­కు డి­మాం­డ్ పె­రి­గి రూ­పా­యి వి­లు­వ­పై ఒత్తి­డి పడు­తుం­ది. రూ­పా­యి పతనం జరి­గి­తే ఇతర ది­గు­మ­తుల ఖర్చు­లు కూడా పె­రు­గు­తా­యి. ఇది ద్ర­వ్యో­ల్బ­ణా­న్ని మరింత పెం­చే ప్ర­మా­దం ఉంది. అం­త­ర్జా­తీ­యం­గా చము­రు ధరలు పె­రి­గి­తే దే­శీ­యం­గా పె­ట్రో­ల్, డీ­జి­ల్ ధర­ల­పై కూడా ప్ర­భా­వం పడు­తుం­ది. ఫలి­తం­గా సరకు రవా­ణా ఖర్చు­లు పె­రు­గు­తా­యి. ఎర్ర సము­ద్రం­లో భద్ర­తా సమ­స్య­లు తలె­త్తి­తే నౌ­క­లు ఆఫ్రి­కా చు­ట్టూ ప్ర­యా­ణిం­చా­ల్సి వస్తుం­ది. దీ­ని­వ­ల్ల రవా­ణా సమయం 15–20 రో­జు­లు పె­ర­గ­వ­చ్చు. ఖర్చు­లు 40–50 శాతం అధి­క­మ­య్యే అవ­కా­శం ఉంది. ఈ భా­ర­మం­తా వి­ని­యో­గ­దా­రు­డి­పై­ పడు­తుం­ది.

ఎగుమతులపై ప్రభావం

హా­ర్ము­జ్ మా­ర్గం­లో అం­త­రా­యం ఏర్ప­డి­తే భా­ర­త్ నుం­చి ఇరా­న్, గల్ఫ్ దే­శా­ల­కు ఎగు­మ­తి అయ్యే బా­స్మ­తీ బి­య్యం, ఫా­ర్మా­స్యూ­టి­క­ల్స్, టీ, సు­గంధ ద్ర­వ్యా­ల­పై ప్ర­భా­వం పడే అవ­కా­శం ఉంది. గగ­న­త­లా­లు పా­క్షి­కం­గా మూ­సి­వే­య­డం వల్ల వి­మా­న­యాన సం­స్థ­లు మా­ర్గ­మా­ర్పు­లు చే­యా­ల్సి వస్తోం­ది. దీని వల్ల ఇంధన వి­ని­యో­గం పె­రి­గి వి­మాన టి­క్కె­ట్ల ధరలు కూడా అధి­క­మ­య్యే అవ­కా­శం ఉంది. ఇప్ప­టి­కే అం­త­ర్జా­తీయ టా­రి­ఫ్ అని­శ్చి­తుల మధ్య ఒత్తి­డి­లో ఉన్న స్టా­క్ మా­ర్కె­ట్లు తాజా పరి­ణా­మా­ల­తో మరింత కు­దే­ల­య్యే అవ­కా­శం ఉంది. యు­ద్ధ భయా­లు కొ­న­సా­గి­నంత కాలం మా­ర్కె­ట్ల­లో అస్థి­రత కొ­న­సా­గ­వ­చ్చు.

Tags:    

Similar News