2 రోజులు.. 7లక్షల కోట్లు హాంఫట్
రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.7లక్షల కోట్లు ఆవిరైంది;
రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.7లక్షల కోట్లు ఆవిరైంది. రెండు రోజుల్లో BSE సెన్సెక్స్ 1611 పాయింట్లు పడిపోయింది. అంటే 3.21శాతం నష్టపోయింది. దీంతో మార్కెట్ కేపిటలైజేషన్ రూ.700591.47 కోట్లు పడిపోయింది. 1కోటీ 98లక్షల 75వేల 470 కోట్లకు తగ్గింది.
టెలికం, పవర్, ఆటో, ఎనర్జీ, యుటిలిటీస్, రియాల్టీ సహా దాదాపు అన్ని సెక్టార్లు నష్టాలను చవిచూశాయి. మారుతీ బిగ్గెస్ట్ లూజర్ కాగా.. HUL, Bharti Airtel, Bajaj Auto, NTPC, Bajaj Finance మారియూ UltraTech Cement కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి.
మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సూచీలు 2.22 శాతం కోల్పోయాయి.
మొత్తానికి గురువారం 2247 లిస్టెడ్ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవగా.. 706 సంస్థలు ఫర్వాలేదనిపించాయి. 168 కంపెనీల్లో ఎలాంటి మార్పు లేదు.