ఐపీఎల్ క్రేజ్.. 200 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను దాటిన జియో హాట్‌స్టార్

ఐపీఎల్ బూమ్ తర్వాత జియో హాట్‌స్టార్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద OTT ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది, సబ్‌స్క్రైబర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.;

Update: 2025-04-15 11:56 GMT

ఐపీఎల్ బూమ్ తర్వాత జియో హాట్‌స్టార్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద OTT ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది, సబ్‌స్క్రైబర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారతదేశంలో ప్రారంభించిన రెండు నెలల్లోనే జియో హాట్‌స్టార్ తన తొలి మైలురాయిని సాధించింది. కొత్తగా ప్రారంభించబడిన ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 200 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను దాటింది. దీనికి ఒక ప్రధాన కారణం ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పట్ల ఉన్న క్రేజ్, అభిమానులను ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్‌కు అతుక్కుపోయేలా చేసింది. జియో హాట్‌స్టార్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా, భారతదేశంలోనే అతిపెద్దదిగా మారింది.

200 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను దాటిన జియో హాట్‌స్టార్

గ్లోబల్ OTT మార్కెట్‌లో జియోహాట్‌స్టార్ కంటే ముందుంది, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రమే. డిస్నీ+హాట్‌స్టార్ మరియు జియో సినిమా అధికారికంగా విలీనం అయిన తర్వాత, ఫిబ్రవరి 14, 2025న జియోహాట్ స్టార్ ప్రారంభించబడింది.

మార్చిలో IPL 2025 ప్రారంభమైన తర్వాత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 100 మిలియన్ల భారీ సబ్‌స్క్రైబర్ బేస్‌ను సాధించింది. ప్రారంభించిన సమయంలో కూడా ఇది 50 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను సంపాదించింది.

Tags:    

Similar News