అదే మా సక్సెస్ మంత్రం..: ముఖేష్ అంబానీ

Update: 2020-10-09 09:26 GMT

రిలయన్స్‌ జియో సంస్థ కేవలం 3 సంవత్సరాల్లోనే 4జీ నెట్‌వర్క్‌ రంగంలో సంచలనాలు సృష్టించిందన్నారు ముఖేష్ అంబానీ. పోటీ కంపెనీలకు 2జీ నెట్‌వర్క్‌ నిర్మాణానికి పాతికేళ్లు పట్టిందన్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. TMఫోరం ఆధ్వర్యంలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వరల్డ్‌ సిరీస్‌ 2020 వర్చువల్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

జియోకు ముందు మనదేశం అత్యధికంగా 2జీ టెక్నాలజీకే పరిమితమైందన్నారు. జియో దేశ డిజిటల్ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు.

2016లో టెలికాం పరిశ్రమలోకి జియో ప్రవేశించినప్పటి నుంచి మొబైల్‌ డేటా వినియోగంలో 155వ స్ధానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు అగ్రస్ధానానికి చేరిందని గుర్తుచేశారు. 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను ఆకట్టుకున్న ఏకైక కంపెనీ తమదన్నారు. భారత్‌లో డేటా 0.2 బిలియన్‌ జీబీ నుంచి 600 శాతం వృద్ధితో 1.2 బిలియన్‌ జీబీకి చేరిందన్నారు. జియో వచ్చిన తర్వాత అంతకంటే ముందు కంటే 30 రెట్లు డేటా వినియోగం పెరిగిందన్నారు. 5జీ సేవలు ద్వారా సరికొత్త డిజిటల్ ప్రపంచం దేశీయ టెలికం వినియోగదారులకు పరిచయం చేస్తామంటున్నారు ముఖేష్ అంబానీ.

courtesy :Also Read:Profityourtrade


Tags:    

Similar News