ఇల్లు కొనాలనుకునే వారికి శుభవార్త.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ బంపర్ ఆఫర్
కరోనా ప్రభావంతో దెబ్బతిన్న మధ్యతరగతి వాసి సొంతింటి కలను నెరవేర్చేందుకు తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణాలు అందించాలని సంస్థ భావించింది.;
కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.50 లక్షల వరకు గృహ రుణాలకు వడ్డీ రేట్లను 6.66 శాతానికి తగ్గించినట్లు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. సవరించిన రేట్లు వచ్చే నెల ఆగస్టు 31 వరకు వర్తిస్తాయని పేర్కొంది.
కరోనా ప్రభావంతో దెబ్బతిన్న మధ్యతరగతి వాసి సొంతింటి కలను నెరవేర్చేందుకు తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణాలు అందించాలని సంస్థ భావించింది. తత్ఫలితంగా ఎక్కువ మంది ఇల్లు కొనుక్కునేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని సంస్థ వెల్లడించింది.
కస్టమర్ విశ్వాసంతో పాటు ఈ రంగం యొక్క పునరుజ్జీవనం కోసం ఇది ఎంతో సహాయపడుతుందని మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ వై విశ్వనాథ గౌడ ఒక ప్రకటనలో తెలిపారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ గరిష్టంగా 30 సంవత్సరాల కాలపరిమితితో గృహ రుణాలపై 6.66 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రుణదాతలు ఆన్‌లైన్ ద్వారా కూడా హోమ్‌లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.