Low Interest Rates: ఇల్లు కొనుగోలుకు ఇదే సరైన సమయం.. ఎందుకంటే..
Low Interest Rates: ఆర్భీఐ తీసుకున్న ఈ నిర్ణయం గృహనిర్మాణ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది.;
Low Interest Rates: నిర్మలమ్మ బడ్జెట్ నిరాశను మిగిల్చినా.. ఆర్బీఐ తాజా నిర్ణయం కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారి కోసం శుభవార్తను అందించింది. ఆర్బీఐ నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతదంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊరట కలిగింది.. రియల్ వ్యాపారం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల సమావేశానంతరం కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీ రెపో, రివర్స్ రెపో రేట్లను వరుసగా 4 శాతం, 3.35 శాతంగా ఉంచింది. రెపో రేట్ యథాతథంగా ఉండడంతో బ్యాంకులు రుణదాతలకు ఇచ్చే వడ్డీ రేట్లు అలాగే ఉంచే అవకాశం ఉంది.
ఆర్భీఐ తీసుకున్న ఈ నిర్ణయం గృహనిర్మాణ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. దీంతో కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారు తక్కువ వడ్డీకే రుణాలు పొందుతారు. ప్రస్తుతం బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు 6.4-6.9 శాతం మధ్య ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ రంగం రికవర్ అవడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బీఐ తీసుకున్న అనుకూల వైఖరి ఆర్థిక వాతావరణాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు. వడ్డీ రేటు తక్కువగా ఉన్నందున కొత్తగా గృహాలు కొనుగోలు చేయాలనుకునేవారికి వెసులుబాటుగా ఉంటుందని తెలిపారు. సానుకూల అంశాలు ఉండడంతో కొత్త ఇంటి కోనుగోలుకు ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం.