Hyundai Exter : టాటా పంచ్‌కు దెబ్బ మీద దెబ్బ.. కొత్త ఫీచర్లతో రాబోతున్న హ్యుందాయ్ ఎక్స్టర్.
Hyundai Exter : భారతీయ రోడ్లపై మైక్రో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. ఈ విభాగంలో టాటా పంచ్‌కు గట్టి పోటీనిస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా 2026 మోడల్ హ్యుందాయ్ ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. 2023లో తొలిసారి లాంచ్ అయిన ఈ కారు, కేవలం మూడేళ్లలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా డిజైన్‌లో చిన్నపాటి మార్పులు, అదిరిపోయే కొత్త ఫీచర్లతో ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రాబోతోంది.
డిజైన్‌లో కొత్త మెరుపులు
టెస్టింగ్ సమయంలో కనిపించిన వివరాల ప్రకారం.. ఎక్స్టర్ సిగ్నేచర్ స్టైల్ అయిన H-ఆకారపు ఎల్ఈడీ డిఆర్‌ఎల్స్ అలాగే కొనసాగనున్నాయి. అయితే, కారు వెనుక భాగంలో భారీగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వెనుక టెయిల్ లైట్ల మధ్య ఒక కొత్త కనెక్టింగ్ లైట్ బార్‌ను జత చేసే అవకాశం ఉంది, ఇది కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ముందు వైపు బంపర్, గ్రిల్ డిజైన్‌లో కూడా చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. స్క్వేర్ షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ మాత్రం పాత మోడల్ లాగే స్పోర్టీగా కనిపిస్తున్నాయి.
హైటెక్ ఫీచర్ల అప్‌గ్రేడ్
హ్యుందాయ్ ఎప్పుడూ తన కార్లలో ఫీచర్లకు పెద్దపీట వేస్తుంది. కొత్త ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ కానుంది. ఈ వెర్షన్‌లో మరింత పెద్దదైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెరుగైన కనెక్టెడ్ కార్ టెక్నాలజీని అందించనున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, వాయిస్ కమాండ్ ఫీచర్లను మరింత స్మార్ట్‌గా మార్చారు. బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి ఈ కారు ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.
ఇంజిన్, పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ విషయంలో హ్యుందాయ్ పెద్దగా మార్పులు చేయడం లేదు. నమ్మకమైన 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే ఇందులోనూ వాడనున్నారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. మైలేజ్ కోరుకునే వారి కోసం హ్యుందాయ్ తన స్వంత ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో కూడిన సిఎన్‌జి వెర్షన్‌ను కూడా అందుబాటులో ఉంచనుంది. దీనివల్ల బూట్ స్పేస్ కూడా ఎక్కువగా లభిస్తుంది, ఇది ఫ్యామిలీ ట్రావెలర్లకు పెద్ద ప్లస్ పాయింట్.
ధర, పోటీ
హ్యుందాయ్ ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్ 2026 మధ్య నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర ప్రస్తుత మోడల్ కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇది ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ విభాగంలోనే పోటీ పడనుంది. ప్రధానంగా టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ వంటి కార్లకు ఇది గట్టి సవాలు విసరనుంది. సేఫ్టీ పరంగా కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ ఫీచర్‌గా వచ్చే అవకాశం ఉంది.