Smart Phones : సెప్టెంబర్ నెలలో రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు.. ఆపిల్ 14తో పాటు మరికొన్ని..
Smart Phones 2022: ప్రపంచ వ్యాప్తంగా పండుగల సీజన్ ప్రారంభం కానుంది. అందువల్ల, రాబోయే రెండు నెలల్లో మార్కెట్లోకి మరిన్ని కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కాబోతున్నాయి.;
Smart Phones 2022: ప్రపంచ వ్యాప్తంగా పండుగల సీజన్ ప్రారంభం కానుంది. అందువల్ల, రాబోయే రెండు నెలల్లో మార్కెట్లోకి మరిన్ని కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కాబోతున్నాయి.
అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో కనివినీ ఎరుగని రీతిలో చాలా ప్రీమియం మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం..
మోటో ఎడ్జ్ 30: మోటొరోలా కంపెనీ నుంచి ఫ్లాగ్‌ఫిష్ స్మార్ట్‌ఫోన్ మోటో ఎడ్జ్ 30 (Moto Edge 30) సెప్టెంబర్ 8న లాంచ్ అవుతుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1,6.5-6.8 అంగుళాల OLED డిస్‌ప్లే, 8/12GB RAM, 4600 mAh బ్యాటరీతో ఈఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 12తో రానున్న ఈ మొబైల్ 2022 చివరి నాటికి ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను అందుకోవచ్చు.
అసుస్ రోగ్ ఫోన్ 6D అల్టిమేట్: అసుస్ రోగ్ ఫోన్ 6D అల్టిమేట్ (Asus ROG phone 6D Ultimate) ఎడిషన్ సెప్టెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+, ఫుల్ HD+ 165 Hz డిస్‌ప్లే, 6000 mAh బ్యాటరీ ఉంటుంది.
ఐఫోన్ ప్రొడక్ట్స్: ఈ నెల 7న నిర్వహించనున్న ఫార్ అవుట్ ఈవెంట్‌లో ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్ లాంచ్ చేయనుంది. రిపోర్ట్స్ ప్రకారం, ఐఫోన్ 14 ప్రో 1,094 డాలర్ల (సుమారు రూ.83,000) ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుండగా 799 డాలర్ల (దాదాపు రూ.63,000) తో ఐఫోన్ 14 లాంచ్ అవుతుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్ A16 బయోనిక్ ప్రాసెసర్‌తో రిలీజ్ కానున్నాయని సమాచారం.
ఐఫోన్ 14, ఐఫోన్ ప్లస్ మోడల్స్ మాత్రం ఓల్డ్ ప్రాసెసర్ A15తో వస్తున్నాయి. ఈ మోడల్స్‌లో సోనీ అప్‌డేటెడ్ 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రైమరీ కెమెరాగా అందించారని టెక్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఇదే ఈవెంట్‌లో యాపిల్ వాచ్ ప్రో 1.9-2.0 అంగుళాల టచ్ స్క్రీన్, 47 మిమీ కేస్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. యాపిల్ వాచ్ సిరీస్ 8 కూడా రిలీజ్ కానుందని టాక్.
పోకో ఎం5: పోకో ఎం5 మొబైల్ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో ఈ మొబైల్ వస్తుందని టిప్‌స్టర్స్ వెల్లడించారు. మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుందని కంపెనీ ఇప్పటికే క్లియర్ హింట్ ఇచ్చింది.