Petrol and Diesel Prices : ఆగని పెట్రో మంట.. మళ్ళీ ఎంత పెరిగిందంటే..!

Petrol and Diesel Prices : దేశంలో మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.. తాజాగా మంగళవారం లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ. 80 పైసల చొప్పున పెంచాయి.

Update: 2022-04-05 02:15 GMT

దేశంలో మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.. తాజాగా మంగళవారం లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ. 80 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.61, డీజిల్‌ రూ.95.87కు చేరింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.118.59, డీజిల్‌ రూ.104.62కి పెరిగింది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 120 దాటింది. గత నెల మార్చి 22 నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 15 రోజుల్లో 12 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.11 వరకు పెరిగింది.  

Tags:    

Similar News