Petrol and Diesel Prices : మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
Petrol and Diesel Prices : పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి.. ఆదివారం రోజున పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి.;
Petrol and Diesel Prices : పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి.. ఆదివారం రోజున పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరగగా, సోమవారం రోజున లీటరుకు 40 పైసలు చొప్పున పెరిగాయి.. గత రెండు వారాల్లో మొత్తం ధరలు లీటరుకు ₹ 8.40కి పెరిగాయి. దీనితో ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.81, డీజిల్ రూ.95.07కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.117.68కి, డీజిల్ రూ.103.75కి చేరింది. గత 14 రోజుల్లో 12 రోజులు ధరలు పెరిగాయి. మార్చి 22 నుంచి ఇంధన ధరలు పెరగడం మొదలయ్యాయి.