SBI ఖాతాదారులకు నిరాశ కలిగించే వార్త..!
SBI తమ ఖాతాదారులకు ఓ నిరాశ కలిగే వార్తను అందించింది. బేసిక్ సేవింగ్ అంటే జీరో బ్యాలెన్స్ సేవలు కలిగి ఉన్నవారి నుంచి జూలై ఒకటి నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు వసూల చేయనుంది.;
SBI తమ ఖాతాదారులకు ఓ నిరాశ కలిగే వార్తను అందించింది. బేసిక్ సేవింగ్ అంటే జీరో బ్యాలెన్స్ సేవలు కలిగి ఉన్నవారి నుంచి జూలై ఒకటి నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు వసూల చేయనుంది. నగదు ఉపసంహరణ, చెక్ బుక్ పై పరిమితులు విధించింది.ఆ పరిథి దాటితే ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. Sbi బ్రాంచ్ మొత్తం ఏటీఎం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. అంతకంటే ఎక్కువసార్లు నగదు తీసుకోవాలంటే ప్రతిసారి పదిహేను రూపాయలతో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎం లనుంచి నగదు తీసుకున్నా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. ఇక పై sbi..ఇతర ఏటీఎం బ్రాంచ్ లలో కలిపి ఒక నెలలో నాలుగుసార్లు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. జీరో బ్యాలెన్స్ కలిగిన వారికి ఒక ఆర్థిక సంవత్సరంలో పది చెక్ లీవ్స్ sbi ఉచితంగా అందజేస్తుంది. ఇక అంతకంటే ఎక్కువ కావాలంటే పది చెక్ లీవ్స్ కలిగిన బుక్ కి నలభై రూపాయిలు, అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 25 చెక్ లీవ్స్ కావాలంటే జీఎస్టీ తో పాటు 75 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అత్యవసరంగా చెక్ బుక్ కావాలని ఉంటే 10 లీవ్స్ కి 50 రూపాయలు,అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.