ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్..
దేశీ దిగ్గజ క్రెడిట్ కార్డు సంస్థ ఎస్‌బీఐ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కార్డు ఉన్న కస్టమర్లకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కొత్తగా ఫోన్ కొనుగోలు చేసే వారికి ఇది వర్తిస్తుంది.;
దేశీ దిగ్గజ క్రెడిట్ కార్డు సంస్థ ఎస్‌బీఐ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కార్డు ఉన్న కస్టమర్లకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కొత్తగా ఫోన్ కొనుగోలు చేసే వారికి ఇది వర్తిస్తుంది. కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారు ఈ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు.
కొత్తగా వన్‌ప్లస్ 9 సిరీస్ కొనుగోలు చేసేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. వన్‌ఫ్లస్ 9 ప్రో ఫోన్‌పై రూ.4 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
వన్‌ఫ్లస్ 8టీ ఫోన్‌పై రూ.3వేలు, వన్‌ఫ్లస్ నార్డ్ ఫోన్‌పై రూ.1000. వన్‌ఫ్లస్ 9ఆర్ ఫోన్‌పై రూ.2 వేలు తగ్గింపు ఉంది. ఈ డిస్కౌంట్ కేవలం ఫోన్లపైనే కాదు స్మార్ట్ వాచ్‌లపై కూడా ఉంది.
వన్‌ప్లస్ స్మార్ట్ వాచ్‌పై రూ.2 వేల వరకు తగ్గింపు ఉంది. ఇంకా వన్‌ప్లస్ టీవీలపై కూడా డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌ప్లస్ టీవీ క్యూ 1పై రూ.3 వేలు, వన్‌ప్లస్ టీవీ 32వై1పై రూ.1000, వన్‌ప్లస్ 43 వై 1 పై రూ.1,500, వన్‌ప్లస్ టీవీ 55 యూ 1 టీవీపై రూ.2,500 డిస్కౌంట్ ఉంది. అమెజాన్, వన్‌ప్లస్, ఎంపిక చేసిన పీఓఎస్ స్టోర్లలో ఈ ఆఫర్లు ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటాయి.