SBI గుడ్ న్యూస్.. 5 సెకన్లలో 20లక్షల రుణం..!
ఇక నుంచి లోన్‌ల కోసం బ్యాంక్‌ల చుట్టూ తిరగకుండా ఎస్‌బీఐ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ కింద కేవలం 5 సెకన్లలో 20లక్షల రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుంది.;
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి లోన్‌ల కోసం బ్యాంక్‌ల చుట్టూ తిరగకుండా ఎస్‌బీఐ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ కింద కేవలం 5 సెకన్లలో 20లక్షల రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే.. ఈ లోన్ కోసం వినియోగదారులు మిస్డ్ కాల్ లేదంటే ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్నీ ఎస్‌బీఐ తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తక్కువ డాక్యుమెంటేషన్‌తో వినియోగదారులు వెంటనే లోన్ పొందడానికి ఈ సేవలను ప్రారంభించినట్లు ఎస్‌బీఐ పేర్కొంది.
ఈ ఎస్‌బీఐ వ్యక్తిగత రుణలపై వడ్డీ రేటు 9.60 శాతంగా ఉంటుంది. అన్ని భారతీయ బ్యాంకులతో పోలిస్తే చాలా తక్కువేనని చేప్పాలి.ఎస్‌బీఐ శాలరీ అకౌంట్ గల ఖాతాదారుడు మొదట ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ సర్వీసు ద్వారా పొందగలిగే ఎస్‌బీఐ రుణ మొత్తం కనీసం నుంచి రూ.25 వేల నుంచి గరిష్టం రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ లోన్ తీసుకున్న వినియోగదారుడు మొదటి రుణాన్నీ సకాలంలో చెల్లించినట్లయితే తర్వాత రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ రుణాలను కూడా పొందవచ్చు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఎస్‌బీఐ వ్యక్తిగత రుణం ఎటువంటి హామీ లేదా భద్రత లేకుండా ఇవ్వబడుతుంది.
ఈ లోన్ పొందాలంటే వినియోగదారుడు ఎస్‌బీఐ శాలరీ అకౌంట్ కలిగి ఉండాలి.. దినితో పాటుగా కనీస నెలవారీ ఆదాయం రూ.15వేలు ఉండాలి. ఈ రుణాన్ని పొందాలనుకునే వారు PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది. లేదంటే 7208933142 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీకు రుణం లభిస్తుంది. మీరు తీసుకునే రుణమొత్తాన్ని బట్టి వడ్డీ రేటు కూడా 9.60 శాతం నుంచి నిర్ణయించబడుతుంది.
ఎస్‌బీఐ యొక్క ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ గురించి మరింత సమాచారం కోసం, ఈ లింక్ క్లిక్ చేయండి .