దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం అనూహ్యంగా పుంజుకున్నాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకానొక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల లాభాన్ని అర్జించింది. చివరికి 809 పాయింట్ల లాభంతో 81,765 వద్ద, నిఫ్టీ 240 పాయింట్ల లాభంతో 24,708 వద్ద స్థిరపడ్డాయి. అత్యధికంగా ఐటీ షేర్లు 1.95% లాభపడ్డాయి. Trent, Infy, TCS, Titan టాప్ గెయినర్స్. Sbi Life, HDFC life, BajajAuto టాప్ లూజర్స్. రెపోరేటును RBI 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తుందన్న ఊహాగానాలతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడినట్టు తెలుస్తోంది. RBI ద్రవ్య విధాన కమిటీ సమావేశం Wed ప్రారంభమైంది. సమావేశ వివరాలను శుక్రవారం వెల్లడిస్తారు. ఆర్థిక రంగానికి బూస్ట్ ఇచ్చేలా RBI వడ్డీ రేట్లలో కోత విధిస్తుందని ఇన్వెస్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో IT, బ్యాంకు, ఫైనాన్స్ రంగ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు.