STOCKS: మూడీస్ డౌన్‌గ్రేడ్ ఎఫెక్ట్... మార్కెట్ పతనం
మార్కెట్ క్యాపిటలైజేషన్ పై ప్రభావం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు;
భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న అనిశ్చితి, ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు సూచీలపై బరువు వేయడంతో మార్కెట్లు క్షీణించాయి. సెషన్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 644 పాయింట్లు (0.79%) పడిపోయి 80,952 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఇది 1,100 పాయింట్ల వరకూ పడిపోయింది. నిఫ్టీ 204 పాయింట్లు (0.82%) కోల్పోయి 24,609 వద్ద ముగిసింది. దేశీయంగా రిలయన్స్, ఐటీ, ఆటో రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ పై ప్రభావం
బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ₹1.86 లక్షల కోట్లు నష్టపోయి, ₹439.32 లక్షల కోట్లకు పడిపోయింది.
ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ సూచీలు 1% - 1.5% మేర పడిపోయాయి.
నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్స్ సూచీలు 0.5% వరకు నష్టపోయాయి.
మిడ్‌క్యాప్ 0.5%, స్మాల్‌క్యాప్ 0.26% తగ్గాయి.
పతనానికి ప్రధాన కారణాలు:
యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం: 30 ఏళ్ల బాండ్ల ఈల్డ్ 1.5 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరి 5% దాటింది. ఇది ఇక్విటీ మార్కెట్ల నుంచి మూలధనాన్ని బాండ్లవైపు మళ్లిస్తోంది.
మూడీస్ క్రెడిట్ రేటింగ్ డౌన్‌గ్రేడ్: అమెరికా రేటింగ్ AAA నుంచి AA1కి తగ్గింది. పెరుగుతున్న రుణ భారం ప్రధాన కారణం.
కీలక షేర్ల లావాదేవీలు
కాస్మో ఫస్ట్, జై భారత్ మారుతి, నహర్ పాలీ ఫిల్మ్స్, రామ్‌కో సిస్టమ్స్ 20% కి పైగా లాభపడ్డాయి.
ఆర్కే స్వామి, వడిలాల్ ఇండస్ట్రీస్ 10% కన్నా ఎక్కువగా నష్టపడ్డాయి.
రామ్‌కో సిస్టమ్స్, బ్లూ పెబుల్, కాఫీ డే వంటి 84 షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకాయి.
NIBE, ఇండో టెక్ ట్రాన్స్‌ఫార్మర్స్ సహా 53 షేర్లు లోయర్ సర్క్యూట్‌కు చేరాయి. మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. బిఎస్ ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33 శాతం, బిఎస్ ఇ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం పెరిగాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లో రూ.441 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.439 లక్షల కోట్లకు పడిపోయింది.