TARIFFS: మొబైల్‌ రీఛార్జ్‌లపై మళ్లీ మోత.!

సామాన్యులపై మరో భారం.. 10-12శాతం పెరగనున్న రీఛార్జ్ ధరలు;

Update: 2025-07-08 06:30 GMT

సా­మా­న్యు­ల­కు మరో షాక్ తగ­ల­నుం­ది. ఇప్ప­టి­కే పె­ట్రో­ల్, డీ­జి­ల్, గ్యా­స్, ని­త్యా­వ­సర వస్తు­వుల ధర­ల­తో నానా కష్టా­లు పడు­తు­న్న మధ్య­త­ర­గ­తి ప్ర­జ­ల­కు మరో భారం పడ­నుం­ది. టె­లి­కాం కం­పె­నీ­లు రీ­ఛా­ర్జ్ ధర­ల­ను మళ్లీ పెం­చే సం­కే­తా­లు ఇస్తుం­డ­టం­తో సా­మా­న్య వి­ని­యో­గ­దా­రు­ల­పై మో­ప­బ­డే భారం మరింత పె­రి­గే అవ­కా­శ­ముం­ది. గతే­డా­ది­లో రీ­ఛా­ర్జ్‌ ప్లా­న్‌ ధర­ల­ను భా­రీ­గా పెం­చిన మొ­బై­ల్ నె­ట్‌­వ­ర్క్‌ కం­పె­నీ­లు మరో­సా­రి పెం­పు­న­కు సి­ద్ధ­మ­వు­తు­న్నా­యి. ఈ ఏడా­ది చి­వ­రి­కి దే­శీయ టె­లి­కాం సం­స్థ­లు మొ­బై­ల్‌ టా­రి­ఫ్‌­ల­ను 10-12 శాతం పెం­చే అవ­కా­శం ఉన్న­ట్లు ఇం­డ­స్ట్రీ ఎగ్జి­క్యూ­టి­వ్స్‌, మా­ర్కె­ట్‌ వి­శ్లే­ష­కు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు. రి­కా­ర్డు స్థా­యి­లో యా­క్టి­వ్‌ సబ్‌­స్క్రై­బ­ర్లు పె­ర­గ­డం, 5జీ సదు­పా­యాల నే­ప­థ్యం­లో ఈ పెం­పు ఉం­డొ­చ్చ­ని చె­బు­తు­న్నా­రు.

74 లక్షల మంది సబ్‌స్క్రిప్షన్

దేశంలో మొబైల్‌ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య మే నెలలో రికార్డు స్థాయిలో పెరిగింది. ఆ ఒక్క నెలలోనే 74 లక్షల మంది కొత్తగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నారు. 29 నెలల్లో ఇదే గరిష్ఠం కావడం గమనార్హం. దీంతో మొత్తం యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఏకంగా 108 కోట్లకు చేరువైంది. ఆ నెలలో రిలయన్స్‌ జియోలో కొత్తగా 55 లక్షల మంది చేరగా.. ఎయిర్‌టెల్‌‌కు 13 లక్షల మంది కొత్త వినియోగదారులు వచ్చారు. దీంతో యూజర్ల సంఖ్య పెరగడంతో టారిఫ్‌ల పెంపుపై టెలికాం సంస్థలు దృష్టి సారించినట్లు ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్‌ వెల్లడించింది.

ఈ ఏడాది 10-12 శాతం పెంచే అవకాశం

గతేడాది జులైలో బేస్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ల ధరలు సగటున 11-23 శాతం పెరిగాయి. ఈ ఏడాది చివరికి మరో 10-12 శాతం పెంచే అవకాశం ఉంది. అయి­తే, ఈసా­రి బే­స్‌ ప్లా­న్‌ల జో­లి­కి పో­క­పో­వ­చ్చ­ని తె­లు­స్తోం­ది. మధ్య, ఉన్నత శ్రే­ణి ప్లా­న్‌­ల­పై ఛా­ర్జీ­లు పెం­చే అవ­కా­శా­లు కని­పి­స్తు­న్నా­యి. అం­తే­కా­కుం­డా డేటా వి­ని­యో­గం, డేటా వేగం, డే­టా­ను వి­ని­యో­గిం­చే ని­ర్ది­ష్ట సమ­యాల ఆధా­రం­గా ఈ పెం­పు ఉం­డొ­చ్చ­ని తె­లు­స్తోం­ది. కొ­త్త రీ­ఛా­ర్జ్‌ ప్యా­క్స్‌ డే­టా­లో భా­రీ­గా కోత పె­ట్టే అవ­కా­శం కని­పి­స్తోం­ది. డేటా ప్యా­క్‌­ల­ను ప్ర­త్యే­కం­గా కొ­ను­గో­లు చే­సే­లా వీ­టి­ని రూ­పొం­దిం­చ­ను­న్న­ట్లు మా­ర్కె­ట్‌ ని­పు­ణు­లు చె­బు­తు­న్నా­రు. మొ­బై­ల్‌ టా­రి­ఫ్‌­ల­లో మా­ర్పు­లు అవ­స­ర­మ­ని ఇప్ప­టి­కే ఎయి­ర్‌­టె­ల్‌, వొ­డా­ఫో­న్‌ ఇం­డి­యా ఎగ్జి­క్యూ­టి­వ్స్‌ అభి­ప్రా­యం వ్య­క్తం చే­శా­రు.

టైర్ సిస్టమ్ ప్రకారం కొత్త ధరల విధానం?

ప్లా­న్ ధరలు మళ్లీ పె­ర­గ­ను­న్న­ప్ప­టి­కీ, ఇది అం­ద­రి­కీ ఒకే­లా ఉం­డ­బో­ద­ని, టైర్ సి­స్ట­మ్‌ ఆధా­రం­గా వే­ర్వే­రు ధరలు ఉం­డ­వ­చ్చ­ని ని­పు­ణు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. వి­ని­యో­గ­దా­రు­డు ఎంత డేటా వా­డు­తు­న్నా­డో, ఏ సమ­యం­లో వా­డు­తు­న్నా­డో ఆధా­రం­గా ప్లా­న్ ధరలు ని­ర్ణ­యిం­చ­బో­తు­న్నా­రు. ఈ వి­ధా­నం ద్వా­రా తక్కువ వి­ని­యో­గ­దా­రు­ల­కు తక్కువ ఛా­ర్జీ­లు, ఎక్కువ వి­ని­యో­గ­దా­రు­ల­కు ఎక్కువ ఛా­ర్జీ­లు ఉం­డే­లా చే­య­ను­న్నా­రు.

ఎయి­ర్‌­టె­ల్ మే­నే­జిం­గ్ డై­రె­క్ట­ర్ గో­పా­ల్ వి­ట్ట­ల్ ఇప్ప­టి­కే ప్ర­క­టిం­చి­న­ట్లు 'ఒకే సైజ్ అం­ద­రి­కీ సరి­పో­తుం­ది' అన్న పాత మో­డ­ల్ ఇక పని­చే­య­ద­ని ని­పు­ణు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. వి­ని­యో­గ­దా­రుల అవ­స­రా­లు భి­న్నం­గా ఉం­డ­టం­తో వా­రి­కి తగిన ప్ర­కా­ర­మే టా­రి­ఫ్‌­ల­ను రూ­పొం­దిం­చా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని చె­ప్పా­రు. అయి­తే, ప్లా­న్ ధరలు పె­రి­గిన తర్వాత వి­ని­యో­గ­దా­రు­ల­పై ము­ను­ప­టి కంటే ఎం­త­వ­ర­కు భారం పడ­బో­తుం­ద­నే­ది మా­త్రం కం­పె­నీ­లు ఇంకా స్ప­ష్టం­గా చె­ప్ప­లే­దు. అయి­తే, టా­రి­ఫ్ రే­ట్ల పెం­పు తప్ప­ని­స­రి అయ్యే అవ­కా­శా­లు ఉన్నా­యి.

Tags:    

Similar News