Tata Motors: టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్స్.. వివిధ మోడళ్లపై రూ.40 వేల వరకు..

Tata Motors: ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌ల రూపంలో పొందవచ్చు.

Update: 2022-02-16 08:00 GMT

Tata Motors: టాటా మోటార్స్ ఫిబ్రవరి 2022లో సఫారి, హారియర్ మరియు నెక్సాన్‌లపై రూ. 40,000 వరకు తగ్గింస్తున్నట్లు ప్రకటించింది.

టాటా మోటార్స్ ఫిబ్రవరి 2022లో Tiago , Tigor , Nexon , Harrier , మరియు Safari కోసం డిస్కౌంట్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌ల రూపంలో పొందవచ్చు. మోడల్ వారీగా ఆఫర్‌లు..

టాటా టియాగో మరియు టిగోర్: రూ. 10,000 నగదు తగ్గింపుతో పాటు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌ను పొందుతారు. అయితే, ఈ ప్రయోజనాలు ఇటీవల ప్రారంభించిన టియాగో, టిగోర్ యొక్క CNG వెర్షన్‌లకు వర్తించవు.

Nexon కాంపాక్ట్ SUV యొక్క అన్ని డీజిల్ వేరియంట్‌లు, డార్క్ ఎడిషన్ శ్రేణి మినహా, రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌కు అర్హులు. Nexon డీజిల్ 108bhp మరియు 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది.

ఈ నెలలో టాటా హారియర్ మరియు టాటా సఫారిపై డిస్కౌంట్లు రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఆఫర్ అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుంది. 

Tags:    

Similar News