Tata Motors : 4 లక్షల కోట్లకు పెరిగిన టాటా మోటార్స్ సంపద

Update: 2024-07-26 07:45 GMT

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ మొదటిసారిగా 4 లక్షల కోట్ల మార్కెట్ సంపదకు చేరుకుంది. గురువారం నాడు టాటా మోటార్స్ షేర్లు 6.2 శాతం పెరగడంతో ఈ మైలురాయిని కంపెనీ అందుకుంది. కంపెనీ షేరు 1,091 రూపాయల వద్ద ముగిసింది.

దీని కంటే ముందు కంపెనీ మార్కెట్ విలువ రూ.3.63 లక్షల కోట్లుగా ఉంది. టాటా మోటార్స్ ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ తరువాత అతి పెద్ద కార్ల కంపెనీగా ఉంది. విద్యుత్ కార్ల మార్కెట్ లో ప్రస్తుతం టాటా మోటార్స్ లీడర్ గా ఉంది. వాణిజ్య వాహన మార్కెట్లోనూ గణనీయమైన మార్కెట్ వాటా కలిగి ఉంది, ఇటీవలే టాటామోటార్స్ విద్యుత్ కార్ల విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రానున్న కాలంలో టాటా మోటార్స్ 7కు పైగా కొత్త విద్యుత్, పెట్రోల్, డీజిల్, సీఎనీ కార్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Tags:    

Similar News