గుడ్ న్యూస్..పడిపోయిన బంగారం..దిగొచ్చిన వెండి..ఈరోజు రేట్లు ఇలా!

Gold and Silver Rates Today: వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2021-07-28 01:50 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు తగ్గాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(28-07-2021 బుధవారం) బంగారం ధరలు రూ. 220 తగ్గుదల కనిపించింది. నిన్న(27-07-2021) రూ.44,800గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,600గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880గా ఉండగా, ఈ రోజు రూ48,660గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,140గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,660ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,880 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,190ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,660ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. నిన్న(28-07-2021 మంగళవారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ.200 తగ్గింది. ఈ రోజు(28-07-2021 బుధవారం) వెండి 10 గ్రాములు రూ.719గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,900గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (28-07-2021శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News