బంగారం ధరలుపైకి..భారీగా తగ్గిన వెండి ధరలు..ఈ రోజు రేట్లు ఇలా!

Gold and Silver Rates Today: పసిడి ధరలు పెరుతున్నాయి. వెండి ధరలు రెండో రోజు కూడా పడిపోయాయి. వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2021-07-30 01:24 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లి పెరుగుతున్నాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(30-07-2021 శుక్రవారం) బంగారం ధరలు రూ. 110 పెరుగుదల కనిపించింది. నిన్న(29-07- 2021) రూ.44,900గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 48,990గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880గా ఉండగా, ఈ రోజు రూ48,990గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,3000ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,420గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,070 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,070ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,360 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,060ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,990ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు భారీగా పతనమైయ్యాయి. నిన్న(30-07-2021 గురువారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ.4,200తగ్గింది. ఈ రోజు(30-07-2021 శుక్రవారం) వెండి 10 గ్రాములు రూ.664గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 67,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (30-07-2021శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News