WAR: యుద్ధాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు
ఏదో ఒక ఇబ్బందిలో 97 దేశాలు.. దాదాపు 9.5 కోట్ల మంది శరణార్ధులు;
ప్రపంచం గడిచిన కొన్ని దశాబ్దాలుగా వివిధ దేశాల మధ్య బలాత్కార సంఘర్షణలతో చలించిపోతుంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ (GPI)-2024 తాజా నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 97 దేశాలు ప్రస్తుతం ఏదో ఒకరకమైన ఘర్షణలలో చిక్కుకున్నాయి. ఇవి చిన్న స్థాయి అంతర్యుద్ధాల నుండి, భారీ స్థాయిలో చెలరేగిన యుద్ధాల వరకు ఉన్నాయి. ఫలితంగా 9.5 కోట్ల మంది శరణార్థులుగా మారారు. ఇది మానవతా సంక్షోభం వైపు ప్రపంచాన్ని నడిపిస్తోందన్న హెచ్చరికగా భావించవచ్చు. ఈ ఘర్షణల కారణంగా 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 1.91 ట్రిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది ప్రపంచ జీడీపీకి 13.5%. అంటే ప్రతి మనిషికి సగటున రూ.2 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లినట్టే. శాంతి లోపించడం వలన సైనిక ఖర్చులు, విధ్వంసం, పునర్నిర్మాణ వ్యయాలు, ప్రజల జీవిత నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 86 దేశాలు సైనిక ఖర్చులను పెంచుకోవడం శాంతి మార్గం నుంచి వెనక్కి తగ్గుతున్న సూచన.
భారత్ పరిస్థితి
ఈ జాబితాలో భారత్ 144వ ర్యాంకులో నిలిచింది. చైనా (88), శ్రీలంక (100), పాకిస్థాన్ (140), భూటాన్ (21), నేపాల్ (80) కంటే కూడా భారత్ మిగిలిన దేశాల కంటే తక్కువ శాంతి స్థాయిలో ఉన్నట్టు చెబుతోంది. భారత్లో సరిహద్దు వివాదాలు, అంతర్గత సంఘర్షణలు, మిలిటరీపై అధిక ఖర్చులు దీనికి ప్రధాన కారణాలు. 163 దేశాల పరిశీలనలో ఐస్లాండ్ మళ్లీ ప్రథమ శాంతియుత దేశంగా నిలిచింది. అలాగే ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియా, సింగపూర్, స్విట్జర్లాండ్ తదితర దేశాలు టాప్ 10లో నిలిచాయి. ముఖ్యంగా యూరప్ ఖండం అత్యధిక శాంతియుత దేశాల కేంద్రంగా నిలిచింది. యుద్ధం అంటే రాత్రికి రాత్రి చేసేది కాదు. ఇందుకోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తెరవెనుక పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. ఇది ఆ ఖండంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు, మానవ హక్కుల పరిరక్షణను సూచిస్తాయి.
ఘర్షణలు తీవ్రమవుతున్న దేశాలు
ఇజ్రాయెల్-గాజా, రష్యా-ఉక్రెయిన్ వంటి సంఘర్షణలు ప్రపంచ శాంతిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గాజా ఘర్షణలో 2023 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 35 వేల మంది చనిపోయారు. రష్యా-ఉక్రైన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్ జీడీపీ 30% క్షీణించగా, సిరియాలో జీడీపీ 85% వరకు పడిపోయింది. ఈ యుద్ధాల వల్ల మానవతా సంక్షోభాలు ఉధృతంగా ఏర్పడుతున్నాయి.
యుద్ధ టెక్నాలజీ పెరుగుదల
ఇంకా ఒక ఆందోళనకర అంశం ఏమిటంటే, డ్రోన్ల వినియోగం 1400% పెరిగింది. ఉగ్రవాద గుంపులు కూడా ఇవి వినియోగిస్తూ పెద్ద దేశాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఆధునిక సైనిక సాంకేతికత, AI ఆధారిత ఆయుధాల వినియోగం శాంతిని మరింత కలవరపెడుతోంది. మిలిటరీ టెక్నాలజీలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
శాంతి చర్చల్లో తగ్గుతున్న విజయాలు
గతంలో శాంతి చర్చలు విజయవంతంగా పరిష్కారాలు తీసుకురాగలిగినపుడు ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. 1970లో 49% విజయాలు లభించిన శాంతి చర్చలు, 2010 నాటికి 9%కే పడిపోయాయి. ప్రస్తుతం 56 సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ, వాటిలో చాలా వరకు ఇబ్బందులు పరిష్కారానికి చాలా దూరంలో ఉన్నాయి. ఆర్థికంగానే కాకుండా ప్రాణాలను, దేశాల ఉనికిని కోల్పోయేలా ఉన్నామనే ఆలోచనలు ఎవరూ చేయడం లేదు.