WEB CODING: ఉద్యోగాలను మింగేస్తున్న "వెబ్ కోడింగ్"

ఏఐ రాకతో అనేక రంగాల్లో కీలక మార్పులు.. ఏఐ, ఆటోమేషన్ ఆధారిత వర్క్‌ఫోన్లు ఏర్పాటు.. వైబ్ కోడింగ్‌ అనే పద్దతిపై సర్వత్రా చర్చ;

Update: 2025-08-03 05:30 GMT

ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ రా­క­తో అనేక రం­గా­ల్లో కీలక మా­ర్పు­లు చోటు చే­సు­కుం­టు­న్నా­యి. భా­ర­త్‌­తో సహా ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా ము­ఖ్యం­గా టెక్ కం­పె­నీ­ల­న్నీ పు­న­ర్వ­వ­స్థీ­క­రణ బాట పట్టా­యి. అం­దు­లో భా­గం­గా ఉద్యో­గుల తొ­ల­గిం­పు­లు, టె­క్నా­ల­జీ­ని అన్ని స్థా­యి­ల్లో ప్ర­వే­శ­పె­డు­తు­న్నా­యి. కం­పె­నీ­లో ఏఐ, ఆటో­మే­ష­న్ ఆధా­రిత వర్క్‌­ఫ్లో­ను ఏర్పా­టు చే­సేం­దు­కు అడు­గు­లు వే­స్తు­న్నా­యి. ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ టెక్ ఉద్యో­గా­ల­ను మిం­గే­స్తోం­దా? అంటే అవు­న­నే సమా­ధా­నం వి­ని­పి­స్తోం­ది. టెక్ కం­పె­నీ­లు ఏఐ బాట పడు­తూ ఉద్యో­గా­ల్లో కో­త­లు వి­ధి­స్తు­న్నా­యి. ము­ఖ్యం­గా సా­ఫ్ట్‌­వే­ర్ డె­వ­ల­ప­ర్ల­పై ఈ ప్ర­భా­వం పడు­తోం­ది. ఏఐ సహా­యం­తో కోడ్ రా­య­డం వల్ల జూ­ని­య­ర్, కిం­ది స్థా­యి డె­వ­ల­ప­ర్ల అవ­స­రం తగ్గి­పో­తోం­ది. ఈ క్ర­మం­లో 'వై­బ్ కో­డిం­గ్' అనే పద్ధ­తి­పై సర్వ­త్రా చర్చ నడు­స్తోం­ది. అసలు ఏమి­టీ వైబ్ కో­డిం­గ్? ఉద్యో­గాల తొ­ల­గిం­పు­ల­కు దీ­ని­కి ఏమి­టి సం­బం­ధం? భవి­ష్య­త్తు­లో దీని పర్య­వ­సా­నా­లు ఎలా ఉం­టా­యి? అని తె­లు­సు­కుం­దాం..

అసలు ఏమిటీ వైబ్ కోడింగ్?

'వై­బ్ కో­డిం­గ్' అనే­ది అభి­వృ­ద్ధి చెం­దు­తు­న్న సా­ఫ్ట్‌­వే­ర్ డె­వ­ల­ప్‌­మెం­ట్ ప్రా­క్టీ­స్. ఈ పద్ధ­తి ద్వా­రా ఏఐ సహా­యం­తో అప్లి­కే­ష­న్లు తయా­రు­చే­స్తా­రు. అంటే ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ టూ­ల్స్‌­కు ప్రాం­ప్టిం­గ్ ఇచ్చి కోడ్ డె­వ­ల­ప్ చే­యా­లి. ఇం­గ్లీ­ష్ వంటి భా­ష­ల్లో మనకు ఎలాం­టి ఔట్ పుట్ కా­వా­ల­ను­కుం­టు­న్నా­మో ఏఐకి చె­ప్పా­లి. అది ఒక కోడ్ జన­రే­ట్ చే­స్తుం­ది. దా­న్ని ఎగ్జి­క్యూ­ట్ చేసి ఔట్‌­పు­ట్ మనం అను­కు­న్న­ట్లు వచ్చిం­దా లేదా అని చెక్ చే­సు­కో­వా­లి. మనకు అవ­స­ర­మైన వి­ధం­గా ఔట్‌­పు­ట్ జన­రే­ట్ కా­క­పో­తే మళ్లీ ఫీ­డ్‌­బ్యా­క్ ఇచ్చి కో­డ్‌­ను రి­ఫై­న్ చేసే వి­ధం­గా ప్రాం­ప్టిం­గ్ ఇవ్వా­లి. అలా రి­పీ­ట్ చే­సు­కుం­టూ.. మనకు అవ­స­ర­మైన కోడ్ జన­రే­ట్ చే­సు­కో­వా­లి. 2025 ప్రారంభంలో ఆండ్రెజ్ కార్పథీ వైబ్ కోడింగ్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. వైబ్ కోడింగ్ రెండు లెవెల్స్‌లో ఉంటుంది. లో-లెవెల్‌లో ఒక నిర్దిష్టమైన కోడ్ కోసం ప్రాంప్టింగ్ ఇస్తూ దాన్ని రిపీట్ చేస్తారు. హై-లెవెల్‌లో ఒక పూర్తి అప్లికేషన్‌ను తయారు చేసి, దాన్ని లైవ్‌లోకి తీసుకువస్తారు. మనం ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కోడ్‌ను రిఫైన్ చేసి ఇస్తుంది.

తొలగింపులకు ఏమిటి సంబంధం?

ఏఐ, ఆటోమేషన్‌ వల్ల మాన్యువల్ కోడింగ్‌, ఆపరేషనల్ రోల్స్‌కు డిమాండ్ తగ్గింది. వైబ్ కోడింగ్ వంటి పద్ధతులు రావడం వల్ల జూనియర్ డెవలపర్లు అవసరం లేకుండా పోయింది. ఇక ఏఐ ఇంటిగ్రేటెడ్ బృందాలకు కొత్త నైపుణ్యాలు అవసరం అవుతున్నాయి. ఈ కారణాల వల్ల కంపెనీలు ఉద్యోగాల్లో కోతలకు తెగబడుతున్నాయి. ఏఐ, అటోమేషన్‌తో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కంపెనీలు సంస్థలో మార్పులు చేస్తున్నాయి.

భవిష్యత్తులో వైబ్ కోడింగ్ పర్యవసానాలు

జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఎంట్రీ లెవెల్ రోల్స్, మిడ్-సీనియర్ లెవెల్ డెవలపర్లు, కోడింగ్, టెస్టింగ్ వంటి సపోర్ట్ రోల్స్‌.. వైబ్ కోడింగ్ వల్ల ప్రమాదంలో పడతాయి. ఈ రోల్స్‌కు సాధారణ కోడింగ్ నైపుణ్యం అవసరమవుతుంది. అయితే ఏఐ రాక వల్ల వీరి అవసరం లేకుండా పోతోంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు 70 శాతం జాబ్ లిస్టింగ్‌లు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైబ్ కోడింగ్ పద్ధతిని కంపెనీలు ఇంకా ఎక్కువగా అనుసరిస్తే మరిన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైబ్ కోడింగ్‌లో నిజానికి అంత వైబ్ లేదనే విషయం స్పష్టమవుతోంది. పనిలో కేవలం ఏఐ సహాయం తీసుకోవాలే తప్ప.. ఏఐ ఇచ్చిన కోడ్‌ను ఎడిట్ చేసుకుంటూ ఏఐ ఎడిటర్లుగా మారొద్దు. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా పూర్తిగా ఏఐతో పనికానిచ్చేద్దాం అనే టెక్ కంపెనీల ధోరణి కూడా మారాలి.

Tags:    

Similar News