Mahindra XUV 7XO: ఇది కారు కాదు కదిలే సినిమా హాల్..మహీంద్రా XUV 7XO లో అదిరిపోయే డాల్బీ విజువల్స్.
Mahindra XUV 7XO: మహీంద్రా సంస్థ నుంచి వస్తున్న సరికొత్త SUV మహీంద్రా XUV 7XO భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం కారు మాత్రమే కాదు, ఇది రోడ్డుపై వెళ్లే ఒక లగ్జరీ థియేటర్ అని నిరూపిస్తోంది. ప్రపంచ స్థాయి ఆడియో-విజువల్ టెక్నాలజీని సామాన్యుడికి అందుబాటులోకి తెస్తూ, ఈ కారులో దేశంలోనే మొదటిసారిగా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సిస్టమ్స్‌ను ఏకకాలంలో పరిచయం చేశారు. వినోద ప్రియులకు ఈ కారు ఒక స్వర్గధామంలా మారబోతోంది.
సాధారణంగా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లు మనం ఖరీదైన హోమ్ థియేటర్లలో లేదా సినిమా హాళ్లలో చూస్తుంటాం. కానీ మహీంద్రా తన XUV 7XOలో ఈ రెండింటిని కలిపి అందించడం ద్వారా భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త శకానికి నాంది పలికింది. డాల్బీ విజన్ వల్ల స్క్రీన్‌పై రంగులు అత్యంత సహజంగా, బ్రైట్‌గా కనిపిస్తాయి. ఇక 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ ద్వారా లభించే డాల్బీ అట్మాస్ 3D ఎఫెక్ట్ మీకు ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఇందులో Gaana యాప్ ద్వారా మ్యూజిక్, Sony LIV ద్వారా నేరుగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూసే సదుపాయం ఉంది. దేశంలో సిస్టమ్ లెవల్ ఓటీటీ ఇంటిగ్రేషన్ కలిగిన మొదటి కారు ఇదే.
ఈ SUV లో టెక్నాలజీ పీక్స్‌లో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ అంతటా విస్తరించి ఉండే ట్రిపుల్ స్క్రీన్ సెటప్ కారుకి ఒక ఫ్యూచరిస్టిక్ లుక్ ఇస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 540-డిగ్రీల కెమెరా, వెర్లాండ్ వెన్ టిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా వెనుక కూర్చునే వారికి బాస్ మోడ్ ఫీచర్ ద్వారా ముందు సీటును అడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, XUV 7XO లో శక్తివంతమైన 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (203 BHP),2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ (185 BHP) ఆప్షన్లు ఉన్నాయి. 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లతో పాటు, టాప్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ కూడా లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.13.66 లక్షల నుంచి రూ.24.92 లక్షల వరకు ఉంది.
సేఫ్టీ విషయంలో మహీంద్రా ఎప్పుడూ ముందే ఉంటుంది. XUV 7XO గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, రోడ్ మీద వెళ్తున్నప్పుడు నిద్రమత్తును గుర్తించే డ్రైవర్ డ్రౌజీనెస్ అలర్ట్ వంటి అత్యాధునిక రక్షణ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మొత్తానికి విలాసం, వేగం, వినోదం, భద్రత.. ఈ నాలుగింటి కలయికే మహీంద్రా XUV 7XO.