జొమాటో ఏజెంట్ తన కొడుకును వెంట తీసుకుని హోమ్ డెలివరీ..

లింక్డ్ఇన్ పోస్ట్‌లో, జొమాటో యూజర్ ఒకరు సాధారణ ఫుడ్ డెలివరీ ఏజెంట్ స్టోరీని పంచుకున్నారు.;

Update: 2025-04-18 10:18 GMT

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ట్రూషా దావారే ఒక పోస్ట్ ను పంచుకున్నారు. ఇటీవల తాను జొమాటో ద్వారా డిన్నర్ ఆర్డర్ చేసినట్లు రాశారు. డెలివరీ ఏజెంట్ ఆర్డర్ తీసుకుని వచ్చినప్పుడు అతడి పక్కన నిలబడి ఉన్న "ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఒక చిన్న పిల్లవాడిని చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపింది". ట్రూషా ఏజెంట్ అక్షయ్‌ని, ఎందుకు మీతో పాటు మీ కొడుకుని కూడా తిప్పుతున్నారు.. అది కూడా ఇంత రాత్రివెళ అని అడిగింది. అతడు కూడా మీకు సహాయం చేస్తున్నాడా అని అడిగింది. దానికి అతడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయానని తెలిపింది.

డెలివరీ ఏజెంట్ తన భార్య కూడా పనిలో ఉందని వివరించాడు. పిల్లవాడు ఒక్కడే ఇంట్లో ఒంటరిగా ఉన్నందున, తనతో పాటు తీసుకువచ్చానని తెలిపాడు. తండ్రి బాధ్యతాయుత భావానికి ముగ్ధురాలైన ట్రూష, "అక్షయ్ కేవలం ఆహారం డెలివరీ చేయడమే కాదు ; తన కొడుకుకు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం అంటే ఏమిటో చూపిస్తున్నాడు" అని రాసింది.

"ఆ క్షణంలో, ఒక వ్యక్తి భాగస్వామిగా ఉండటాన్ని మాత్రమే కాకుండా, తన భార్య ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చినప్పుడు మద్దతు ఇవ్వడం, వారి బిడ్డ ఇంట్లో ఒంటరిగా ఉండకుండా చూసుకోవడం ఎంత అందంగా ఉంటుందో నేను గ్రహించాను. ప్రేమ ఉన్నప్పుడే భాగస్వామ్య బాధ్యతలను ఒకరికొకరు ఇష్టంగా పంచుకుంటారు. వివాహ బంధం నిలబడాలంటే అది చాలా అవసరం అని ఆమె పోస్ట్ లో పేర్కొంది. 

ఆ పోస్ట్ కు ప్రతి స్పందించిన జొమాటో కేర్ ఇలా వ్యాఖ్యానించింది, "హాయ్ ట్రూషా, దీన్ని మా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. మా డెలివరీల గురించి మేము గర్విస్తున్నాము. వీలైతే, మీ ఆర్డర్ ఐడి వంటి మరిన్ని వివరాలను షేర్ చేయండి, తద్వారా మేము మా డెలివరీ భాగస్వామికి మీ ప్రశంసలను తెలియజేయగలము."

లింక్డ్ఇన్ యూజర్ ఒకరు ఇలా వ్యాఖ్యానించారు, "అందరు సూపర్ హీరోలు కేప్ లు ధరించరు. కొందరు ఎర్రటి టీ షర్టులు ధరిస్తారు, స్కూటర్ పై తమ ప్రపంచాన్ని మోసుకెళ్తారు" అని మరొక యూజర్ జోడించారు.


Tags:    

Similar News