నేటి నుంచే జొమాటో ఐపీఓ.. పూర్తి వివరాలు ఇవే
Zomato IPO: భారత్‌లో మొట్టమొదటి ఫుడ్ టెక్ కంపెనీ జొమాటో ఐపీఓ ఇవాళ ప్రారంభమైంది.;
Zomato File Image
Zomato IPO: భారత్‌లో మొట్టమొదటి ఫుడ్ టెక్ కంపెనీ జొమాటో ఐపీఓ ఇవాళ ప్రారంభమైంది. ఈనెల 16న ముగిసే ఈ ఇష్యూ ద్వారా కంపెనీ భారీగా నిధులను సమీకరించనుంది. తాజా షేర్ల జారీ ద్వారా కంపెనీ రూ.9వేల కోట్లను, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లకు చెందిన షేర్ల విక్రయం (ఆఫర్ ఫర్ సేల్) ద్వారా మరో రూ.375 కోట్లను కంపెనీ సేకరించనుంది.
జొమాటో ఇష్యూ ప్రైస్‌బాండ్ ఒక్కో షేరుకు రూ.72-76గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ మార్కెట్ వాల్యూ 8 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.59,623 కోట్లుగా ఉంది. ఈ ఇష్యూకు ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 35 రెట్లకు పైగా స్పందన లభించింది. 186 యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి బిడ్లు రాగా ఇందులో 19 దేశీయ మ్యూచువల్ ఫండ్స్ నుంచి 74 స్కీమ్‌లు కూడా ఉన్నాయి.