కాసేపట్లో వారాహి యాత్ర ప్రారంభం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. అన్నవరంలో సత్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్. అలాగే వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. అన్నవరం నుంచి జాతీయ రహదారి మీదుగా కత్తిపూడి వరకు తన వాహనంలో వస్తారు. కత్తిపూడి వద్ద వారాహి వాహనం ఎక్కనున్నారు. కత్తిపూడి జంక్షన్‌లో పవన్ కళ్యాణ్ మొదటి బహిరంగ సభలో పాల్గొంటారు. తొలి బహిరంగ సభలో పవన్ ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Update: 2023-06-14 13:34 GMT