జనసేనాని Pawan Kalyan వారాహి యాత్ర మొదలైంది

కత్తిపూడి జంక్షన్ లో వారాహి వేదికగా పవన్ మొదటి బహిరంగ సభలో పాల్గొననున్నారు;

Update: 2023-06-14 09:41 GMT

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Janasenaనాని Varahi యాత్ర మొదలైంది. జనసేన పార్టీ అధ్యక్షులు, రథసారధి ప్రజలతో మమేకమవడానికి, వారి కష్టసుఖాలను తెలుసుకుని రానున్న ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడానికి యాత్రను ప్రారంభించనున్నారు.

అన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్‌.. సత్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారాహికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ రోజు మధ్యాహ్నం వారాహి యాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం 5 గంటలకు కత్తిపూడి జంక్షన్ లో వారాహి వేదికగా పవన్ మొదటి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నెల 24వరకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్‌ వారాహి యాత్రను నిర్వహించనున్నారు.

జనసైనికులు ఇప్పటికే సభను దిగ్విజయం చేయడానికి భారీ ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలే లక్ష్యంగా ఆంద్ర ప్రజలకు మంచి నాయకత్వాన్ని అందించడానికి పవన్ కళ్యాణ్ నడుంబిగించారు.

మొదటి విడతగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర సాగనుంది. పవన్ వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లోని.. పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరుకుంటుంది. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు యాత్ర సాగనుంది. ఎల్లుండి పిఠాపు రం, జూన్ 18న కాకినాడ, జూన్ 20న ముమ్మిడివరం, జూన్ 21న అమలాపురం, జూన్ 22న మలికిపురం, జూన్ 23న నరసాపురంలో బహిరంగసభలు నిర్వహిస్తారు.

Full View

Live Updates
2023-06-14 13:34 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వారాహి యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. అన్నవరంలో సత్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్‌. అలాగే వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. అన్నవరం నుంచి జాతీయ రహదారి మీదుగా కత్తిపూడి వరకు తన వాహనంలో వస్తారు. కత్తిపూడి వద్ద వారాహి వాహనం ఎక్కనున్నారు. కత్తిపూడి జంక్షన్‌లో పవన్ కళ్యాణ్‌ మొదటి బహిరంగ సభలో పాల్గొంటారు. తొలి బహిరంగ సభలో పవన్‌ ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

2023-06-14 10:03 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్యదేవుని దర్శనానికి వస్తున్నారని తెలిసికూడా కావాలనే విజయవాడ వెళ్ళిపోయి కనీసం స్వాగతం పలకని వైనం పై అసంతృప్తి వ్యక్తం చేసిన జనసైనికులు

2023-06-14 09:49 GMT

వారాహి ప్రచార రథంపై అభివాదం చేస్తూ ముందుకు సాగనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

అన్నవరం నుండి జాతీయ రహదారి-16 మీదుగా కత్తిపూడి వరకు దాదాపు 12 కి.మీ మేర కొనసాగనున్న వారాహి యాత్ర


Tags:    

Similar News