Mowgli Movie : డిసెంబర్ 12న 10 సినిమాలు వస్తున్నాయ్

Update: 2025-12-09 10:48 GMT

అఖండ 2 డిసెంబర్ 12న విడుదల కాబోతోంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 5నే విడుదల కావాల్సిన మూవీ పోస్ట్ పోన్ కావడం అసలు భరించలేకపోయారు. అందుకే 12నే వస్తుంది అనుకున్నారు.. ఆ మూవీ కోసమే చూస్తున్నారు. అయితే అదే టైమ్ లో ఈ మూవీ 5నే విడుదల అవుతుందనుకుని అంతా ఆగిపోయారు. తమ చిత్రాలు 12నే రిలీజ్ చేసుకోవాలనుకున్నారు చాలామంది. ఇందుకోసం డిసెంబర్ 5న వాళ్లంతా త్యాగం చేశారు. కట్ చేస్తే ఇప్పుడు అఖండ 2నే 5న ఆగిపోయింది. 12నే విడుదల కాబోతోంది. మరి ఆ రోజున ఏకంగా 10కి పైగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. అన్ని సినిమాలు రిలీజ్ అవడం సాధ్యమా..? అఖండ 2 కోసం ఇప్పుడు ఎన్ని సినిమాలు ఆగిపోతాయి అనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే అందరూ చిన్న సినిమాల వాళ్లే. అఖండ 2ను ఎదురించి వాళ్లు మాట్లాడ్డం అనేది అసంభవం. టిజి విశ్వ ప్రసాద్ లాంటి నిర్మాతలు కూడా తమ చిత్రం మోగ్లీని కూడా వాయిదా వేయాలనుకోవడం మాత్రం దారుణం.

ఇక ఈ సందర్భంగా ఎన్ని చిత్రాలో విడుదల కాబోతున్నాయి అంటే తెలుసా..? మోగ్లీ. రోషన్ కనకాల, సాక్షి మధోల్కర్, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కలర్ ఫోటో తర్వాత డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఈ మూవీ కూడా 12నే విడుదల కానుంది. సైక్ సిద్ధార్థ్.. నందు హీరోగా నటించిన మూవీ ఇది. అతను చాలా కష్టపడ్డాడు ఈ చిత్రం కోసం. తన కెరీర్ మొత్తం ఈ మూవీ కోసమే చూడాలనుకోవడం అంటున్నాడు. సకుటుంబానాం చిత్రం విడుదల కాబోతోంది. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించిన చితరం ఇది.

త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు కీలక పాత్రల్లో నటించిన మూవీ ఈషా. ఈ మూవీ కూడా 12నే విడుదల కాబోతోంది. అవుట్ అండ్ అవుట్ హారర్ కంటెంట్ తో వస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదిగిన ప్రొడ్యూసర్స్ ఈ మూవీ కోసం నిలబడ్డారు. ట్రైలర్, టీజర్ హడావిడీగా విడుదల చేశారు. మరి ఈ మూవీ కూడా అదే రోజునే విడుదలవుతుందా.

ఇవి కాక ఘంటసాల, కామ ది డిజిటల్ సూత్రాస్, మిస్ టీరియస్ వంటి చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి. వీటితో పాటు కార్తీ హీరోగా నటించిన అన్నగారు వస్తారు మూవీ డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదలవుతోంది. కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన మూవీ ఇది. ఇది కాస్త బాగా ఆలస్యంగా విడుదల కాబోతోన్న మూవీ. అంచేత తమిళ్ వెర్షన్ మాత్రం ఆపడం కష్టం. దాన్ని బట్టి తెలుగు మూవీ కూడా విడుదలవుతుందా అనేది ప్రశ్న. దీంతో పాటు ఆది పినిశెట్టి హీరోగా డ్రైవ్ అనే తమిళ్ మూవీ కూడా విడుదలవుతోంది. ఇది కూడా డిఫరెంట్ కంటెంట్ తో కనిపిస్తోంది. కంప్లీట్ గా కాన్సెప్ట్ బేస్డ్ గా రూపొందుతోన్న మూవీ ఇది. మొత్తంగా ఇన్నేసి సినిమాలు విడుదల అవడం అనేది అఖండ 2 పై ప్రభావం చూపుతోంది. లేదంటే ఇన్నేసి సినిమాలు అఖండ 2 వల్ల ప్రభావం పడబోతోంది. చూద్దాం.. మరి ఇన్ని సినిమాల్లో ఎన్ని థియేటర్స్ కు వస్తాయి.. ఎన్ని ఆగిపోతాయి.. ఇంకెన్ని పోస్ట్ పోన్ అవుతాయి. 

Tags:    

Similar News