Dhurandhar 2 : దుమ్మురేపుతున్న ధురంధర్ 2 ప్రీ సేల్స్

Update: 2026-03-14 10:18 GMT

రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన మూవీ ధురంధర్ మూవీ. ఏ ముహూర్తంలో సెట్ అయిందో కానీ ఈ మూవీ.. ఫస్ట్ పార్ట్ తో రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇలాంటి మూవీస్ సీక్వెల్ అంటే చాలా టైమ్ తీసుకుంటారు. బట్ కేవలం నాలుగు నెలల్లోనే వీళ్లు సెకండ్ పార్ట్ తో వస్తున్నారు. ఫస్ట్ పార్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో ఈ సెకండ్ పార్ట్ ను ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ ప్యాన్ ఇండియా మూవీగా ఇప్పుడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ అడ్వాన్స్ సేల్ లో అదరగొడుతోంది.

ధురంధర్ 2 కు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ క్యాష్ కూడా మారుస్తోంది. అందుకే ఈ మూవీ ఒక రోజు ముందే విడుదల చేయబోతున్నారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ప్రీ సేల్స్ పేరుతో ఆల్రెడీ టికెట్స్ అమ్మేస్తున్నారు. రిలీజ్ కు ఇంకా వారం రోజులు ఉన్నా కూడా ఈ మూవీ ఇప్పటికే ప్రీ సేల్స్ ద్వారా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ స్థాయిలో అమ్మకాలు అంటే భారీ స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయని అర్థం. రిలీజ్ ముందు వరకు కూడా ఈ ప్రీ సేల్స్ కొనసాగుతాయి. ఆ కారణంగా మరో 30 కోట్ల వరకు వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఓ రకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రీ సేల్స్ ద్వారా 80 కోట్ల వసూళ్లు వస్తాయని ఈజీగా చెప్పొచ్చు.

Tags:    

Similar News